పరమ పూజనీయ శ్రీ డాక్టర్ జీ |
తన బాగు చూసుకోగల శక్తి హిందూ సమాజానికి కలిగింపచేయడమే సంఘం తలపెట్టిన కార్యం. మన పొట్ట నింపుకోవడం చేత కాకుండానే మరొకరి ఆకలి తీర్చడానికి పరుగులెత్తే విచిత్రమైన అలవాటు మనకు దాపురించింది. ఇది తొలగిపోందే మనం బాగుపడజాలం. ఆత్మ సంరక్షణశాలిగా రూపొందడమే హిందూ సమాజానికి వైభవం కలగడం.
మనం
కొత్తగా చేయవలసిందేమీ లేదు. మన పూర్వులు మునుపు ఏ సంస్కృతీ సమాజాలను
సేవిన్చాలనే ధ్యేయాన్ని ముందుంచుకొని, దాని ప్రాప్తికై రేయింబవళ్ళు కృషి
చేశారో ఆ ధ్యేయాన్ని అలాగే సాధించి, వారు సగం చేసి విడిపోయిన పనిని మనం
పూర్తి చేయాలి.
హిందూ
సంస్కృతిని ధ్వంసమొనర్చి, మనలను శాశ్వతంగా దాస్యశృంఖలాలలో బంధించి ఉంచాలనే
ఉద్దేశ్యంతో మన దేశానికి వచ్చి ఇంకా ఇక్కడ ఉంటూ ఉన్నటువంటి విదేశీయుల
ఆక్రమణల నుంచి దేశాన్ని రక్షించాలి. దానికి బాధలన్నింటినీ సహించడానికి ఎంత
పరిశ్రమనైనా చేయడానికీ, ప్రాణాలైనా అర్పించడానికి కావలసిన ప్రవృత్తిని
సమాజంలో నిర్మించి, సమాజాన్ని సమైక్యపరిచే కార్యాన్ని సంఘం స్వీకరించింది.
No comments:
Post a Comment