1925…….
డాక్టర్జీ అని ఆప్యాయంగా సంఘ కార్యకర్తలచే పిలువబడే పరమ పూజనీయ డాక్టర్
కేశవరావ్ బలిరాం పంత్ హెడ్గేవార్ గారిచే 27 సెప్టెంబర్’ 1925 రోజు
విజయదశమి పర్వ దినాన సంఘం ప్రారంభించబడినది. వారు ఆ రోజు స్వయం సేవకులను
ఉద్దేశించి ” మనం మన సర్వోన్నత లక్ష్య సాధనలో శారీరకంగాను ,బౌద్దికంగాను
సుశి క్షితులమై స్వయం అనుశాసనం తో ముందుకు సాగాలని ఉద్బోద చేశారు”.
డాక్టర్జీ తొలుత వారి ఇంట్లో అనగా నాగపూర్ లోని “సుక్రవరి’ యందే సంఘాన్ని
నడిపేవారు. ఆదివారాల్లో శారీరక విషయాలు తీసుకునేవారు. ఆ రోజు ఇప్పటిలా
కాకుండా అంతా ఖాకి కలర్ లోనే చొక్కా, నెక్కర్, టోపీ ధరించేవారు. అలాగే ఆది,
బుధ వారాల్లో జాతీయ విషయాలపై చర్చ వుండేది.
1926…. 17 ఏప్రిల్ రోజున, డాక్టర్జీ ఇంట్లో సంఘ పేరు నిర్ణయం చేయడానికని ఒక సమావేశం జరిగింది. ఆ సమావేశంలో “జరిపట్ మండల్”, “భారత్ వుద్దారాక్ మండల్”, “హిందూ స్వయం సేవక్ సంఘ్”, మరియు “రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్” పేర్లు చర్చకు వచ్చాయి. అందులో ” రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ” నిర్ణయమైంది.
1926…. 17 ఏప్రిల్ రోజున, డాక్టర్జీ ఇంట్లో సంఘ పేరు నిర్ణయం చేయడానికని ఒక సమావేశం జరిగింది. ఆ సమావేశంలో “జరిపట్ మండల్”, “భారత్ వుద్దారాక్ మండల్”, “హిందూ స్వయం సేవక్ సంఘ్”, మరియు “రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్” పేర్లు చర్చకు వచ్చాయి. అందులో ” రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ” నిర్ణయమైంది.
ఇది సంఘ నిర్మాత డాక్టర్జీ ఇల్లు |
. 28 మే 1926 రోజున మన తొలి శాఖ నాగపూర్ ” మొహితే వాడ” మైదానం లో ప్రారంభమయ్యింది. లాఠి పేరుతొ దండ విన్యాసాలు , దక్ష, ఆరమ, ఆజ్ఞ లు తొలిసారి సంఘస్తాన్లో ప్రతిధ్వనించాయి. నిత్య కార్యక్రమాల అనంతరం భగవాధ్వజానికి ప్రణాం అర్పించి ..హిందీ మరియు మరాఠీ లో ప్రార్ధన చేప్పేవారు.
మొట్ట మొదటి ” పథసంచలన్” 30 మంది స్వయం సేవకులతో జరిగింది.
1927….. మే మాసంలో 17 మంది స్వయంసేవకులతో మొదటి ప్రాథమిక ప్రత్యేక శిక్షావర్గ జరిగింది. ఈ వర్గల్ని OTC- officer’s training camp పేరుతొ పిలిచేవారు.
1928…. మొదటి “గురుదక్షిణ” కార్యక్రమంలో కార్యకర్తల సమర్పణ రూ. 84 . ఆనాటి కార్యక్రమానికి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి పెద్ద అన్నయ్య శ్రీ విటల్ భాయ్ పటేల్ గారు కార్యక్రమంలో వున్నారు.నాగపూర్లోని మొహితే వాడ శాఖలో ఈ కార్యక్రమం జరిగింది.
మొదటి ప్రతిజ్ఞతా కార్యక్రమం ఎంపిక చేయబడ్డ 99 మంది స్వయంసేవకులతో మార్చ్ 1928 లో జరిగింది. సంవత్సరాంతానికి మొత్తం 18 శాఖలు ప్రారంభమయ్యాయి . ఈ ఏడాది లోనే మొదటి “హేమంత శిభిరం ” ఘోష్ సహిత పతసంచలన్ తో జరిగింది. ఇదే ఏడాది డాక్టర్జీ శుభాష్ చంద్రభోస్ ను కలకత్తాలో కలిసారు.
1929……నవంబర్ 9 , 10 తేదిల్లో నాగపూర్ లోని దోకేమాట్ లో జరిగిన ఒక సమావేశంలో డాక్టర్జీ పూజ్య “సర్ సంఘచాలాక్ ” గాను మాన్య బాలాజీ హుద్దార్ గారు “సర్కార్యవాహ” గా ఎన్నికయ్యారు. అలాగే మార్తాండ్ జోగ్ గారు “సర్ సేనాపతి” గా ఎన్నికయ్యారు.
1930…. . దేశంలో కాంగ్రెస్ “సంపూర్ణ స్వరాజ్యాన్ని ” ప్రకటిస్తూ ఒక తీర్మానాన్ని వెలువరిచింది. అనంతరం డాక్టర్జీ 26 జనవరిని స్వతంత్ర దినం గా జరుపుకోవాలని శాఖలకు సూచించారు . ఈ సమయంలోనే డాక్టర్జీ కొంతమంది స్వయం సేవకులతో కలిసి జంగిల్ సత్యాగ్రహ కార్యక్రమం లో పాల్గొన్నారు. పాల్గొనే ముందు డా. ఎల్ .వి. పరంజపెస్ గారిని సర్ సంఘ్ చాలక్ గా నియమించారు.
ఇదే సంవత్సరం ఖాకి టోపీ కి బదులుగా నల్ల టోపీ ని మార్పు చేయడం జరిగింది.
1931…. 14 ఫిబ్రవరి న డాక్టర్జీ జైలు నుండి విడుదలయ్యారు. ఈ సమయంలోనే బెనారస్ లో శాక ప్రారంభించారు. విశేషమేమంటే ఆ శాఖ ద్వారానే మనకు మాన్య “గురూజీ” భయ్యాజి దాని ఆధ్వర్యం సంఘానికి లభించారు.
(ప్రక్క ఫోటోలో పరమ పూజ్య శ్రీ మాధవ రావు సదాశివ్ రావు గోల్వాల్కర్ (గురూజీ) )
1932…. ఈ సంవత్సరం లోనే సెంట్రల్ ప్రావిన్స్ గవర్నమెంట్ సంఘం లో ప్రభుత్వ ఉద్యోగులు పాల్గొనడాన్ని నిషేదిస్తూ డిసెంబెర్ 15 న ఉత్తరువులు జారీ చేసింది.
1934…. ప్రభుత్వ ఉద్యోగుల్ని నిషేదించిన వుత్తర్వులు అసెంబ్లీ లో వీగిపోయాయి. ఇదే సంవత్సరం వార్ధా లో జరుగుతున్నా హేమంత శిభిరంలో “గాంధీజీ” పాల్గొన్నారు. భగవా ధ్వజానికి ప్రణాం చేశారు. డాక్టర్జీ మరియు అప్పాజీ గాంధీకి శిభిర విశేషాల్ని మరియు సంఘము సంఘ లక్ష్యాలని వివరించారు.
ఇదే సంవత్సరం లో డాక్టర్జీ సంఘ భవిష్య కార్యక్రమాలకోసం రేశంభాగ్ మైదానాన్ని కొన్నారు. అదే ఇపుడు మన ప్రస్తుత ప్రధాన సంఘ కార్యాలయంగా ఆవిర్భవించింది. ఇదే సమయంలో మాన్య శ్రీ గురూజీ నాగపూర్ శాఖా కార్యవాహ గా నియమితులయ్యారు.
1935…. డాక్టర్జీ, మహాకొసల్ సెంట్రల్ ప్రావిన్స్ ప్రాంతానికి సంఘ కార్య విస్తృతి కోసం స్వయం సేవకుల్ని పంపించారు .
1936…. మహారాష్ట్ర లోని అనేక ప్రాంతాల్లో సంఘపని ప్రారంభ మయ్యింది. 25 అక్టోబర్ విజయదశమి రోజు “రాష్ట్ర సేవిక సమితి” ప్రారంభమయ్యింది. ఇదే సంవత్సరంలో పంజాబ్ లో సంఘ పని ప్రారంభమయ్యింది.
1937…. 10 మంది కార్యకర్తల్ని పంపి ఈ సంవత్సరమే ఉత్తర ప్రదేశ్ లో పని ప్రారంభించడం జరిగింది. డాక్టర్జీ పూనే మందిర్లో సత్యాగ్రహంలో పాల్గొన్నారు. ఈ సంవత్సరం లోనే స్వతంత్ర వీర సావర్కర్ అండమాన్ జైలు నుండి విడుదలయ్యారు. 12 డిసెంబెర్ రోజున నాగపూర్ శాఖ వారిని ఘనంగా స్వాగతించింది.
1938….బాంబే ప్రెసిడెన్సి ప్రభుత్వ ఉద్యోగులు సంఘ కార్యక్రమాల్లో పాల్గొనడాన్ని నిషేదించింది. ఈ సంవత్సరమే పూణే లో “హిందూ యువక్ పరిషద్” సమావేశం లో మార్గదర్శనం చేశారు .
డిసెంబెర్ లో వీర సావర్కర్ నాగపూర్ శిభిరాన్ని సందర్శిచారు. ఈ సంవత్సరమే భాగ్యనగర్లో ఆనాటి నిజాం హిందువులపై సాగిస్తున్న ఆకృత్యాలకు, దమన కాండకు వ్యతిరేకంగా భాగ్యనగర్ స్వయం సేవకులు “భాగ్యనగర్ ముక్తి సంగ్రాం ” పేరిట సత్యాగ్రహ ఉద్యమాన్ని నిర్వహించారు.
1938…. శ్రీ గురూజీ సంఘ ” సర్ కర్యవాహ ” భాద్యతల్లో నియమింప బడినారు.
1940…. లో సంఘ పూణే ప్రాంత భైటాక్ లో వీర సావర్కర్ పాల్గొన్నారు .
బ్రటిష్ ప్రభుత్వం సంఘ గణవేష్, మరియు పథసంచలన్ ల పై నిషేధం విధించింది. ఈ సంవత్సరమే సంస్కృత సంఘ ప్రార్ధన మరియు సంస్కృత ఆజ్ఞలు ప్రవేశపెట్టారు. జూన్ 20 న సుభాష్ చంద్ర భోష్, డాక్టర్జీ అనారోగ్యంతో వుండగా పరామర్శించారు.
డాక్టర్జీ పవిత్ర సమాధి. |
1940 జూన్ 21 న ఉదయం 9:27 ని. లకు లక్షలాది అభిమానుల్ని, కార్యకర్తల్ని వదలి డాక్టర్జీ తిరిగిరానిలోకాలకు వెళ్లారు. వారు అందించి వెళ్ళిన సంఘ గంగా ఝరి మాత్రం వారు చూపిన బాటలో జీవనదిగా ప్రవహిస్తూనే వున్నది.
……….. అనంతరం మాధవ సదాశివ గోల్వాల్కర్ ( శ్రీ గురూజీ ) సంఘ “ద్వితీయ సర్ సంఘ్ చాలకులుగా ” జూలై 3 నుండి కొనసాగారు .
1942…. తెల్లదొరలు దేశం వదలి పోవాలంటూ కాంగ్రెస్స్ “క్విట్ ఇండియా ” ఉద్యమాన్ని ప్రారంభించింది. సంఘ కార్యకర్త లెందరో ఈ ఉద్యమం లో క్రియాశీలకంగా పాల్గొన్నారు.
ఈ ఉద్యమంలో మహారాష్ట్ర లోని ‘ఆస్తి-చిమోర్ ‘ లాంటి ప్రాంతాల్లో ఎందరో స్వయం సేవకులు ప్రాణత్యాగాలు చేశారు.
1942…. తెల్లదొరలు దేశం వదలి పోవాలంటూ కాంగ్రెస్స్ “క్విట్ ఇండియా ” ఉద్యమాన్ని ప్రారంభించింది. సంఘ కార్యకర్త లెందరో ఈ ఉద్యమం లో క్రియాశీలకంగా పాల్గొన్నారు.
ఈ ఉద్యమంలో మహారాష్ట్ర లోని ‘ఆస్తి-చిమోర్ ‘ లాంటి ప్రాంతాల్లో ఎందరో స్వయం సేవకులు ప్రాణత్యాగాలు చేశారు.
1946…. కలకత్తా
లో ఆగస్ట్ 16 న ముస్లిం లీగ్ ప్రత్యక్ష దాడిచేసి 5000 మంది హిందువులు
ఊచకోత కొస్తే పట్టించుకున్న నాథుడు లేడు !. అదే సంఘటన లో 15000 మంది
హిందువులు తీవ్ర గాయాల్లో కొట్టుమిట్టాడుతుంటే ఆదుకునే వారే కరువయ్యారు.
1947….కాంగ్రెస్స్
జూన్ 3 న దేశ విభజన కు ఒప్పుకోవడంతో అది హిందువుల పాలిట శరాఘాతమయ్యింది. ఆ
చర్య స్వయం సేవకుల మనస్సును ఒక్కసారిగా కుదిపేసింది. ఆ వెంట నే
దేశవ్యాప్తంగా హిందువు ల పై తీవ్ర స్థాయిలో దాడులు ప్రారంభంయ్యయాయి. పంజాబ్
, బెంగాల్ లలో అత్యధిక సంఖ్యలో హిందువులు క్రూరంగా చంపబడ్డారు. ఈ
సందర్భంగా సంఘం 3000 ప్రత్యక్ష సహాయక శిభిరాల్ని ఏర్పరచింది. ఎందరో
అభాగ్యులను ఆదుకొన్నది.
భారత్ ఆగుస్ట్ 15 న స్వాతంత్ర్యాన్ని పొందింది.
గాంధీ 14 సెప్టెంబర్ రోజున ఢిల్లీ లోని భాంగి కాలనీలో 500 మంది స్వయం సేవకుల నుద్దేశించి ప్రసంగించారు. 17 అక్టోబర్ రోజున పూజ్య గురూజీ కాశ్మీర్ ను బారత్ లో కలపాలని మహారాజ హరిసింగ్ ను కోరుతూ , ఒప్పించడానికి శ్రీనగర్ వెళ్లారు.
ఇదే సంవత్సరం “కెన్యా” దేశం లో స్వయంసేవకులు “భారతీయ స్వయంసేవక్ సంఘ్ ” పేరుతొ సంస్థ ను ప్రారంభించారు.
“ఆర్గనైజర్” మరియు “పాంచజన్య” వార పత్రికలు సంఘ అభిప్రాయాల్ని చెప్పడానికని ఈ సంవత్సరమే ప్రారంభించబడ్డాయి. వివిధ దేశ హిత అంశాలపైన మన అభిప్రాయాలను ప్రకటించడం ప్రారంభించాయి.
1948…. జనవరి 30 న గాంధీ హత్య
గావించబడ్డారు. ఆ దుశ్చర్యను నిరసిస్తూ సంఘం తన ప్రగాడ సంతాపాన్ని ప్రకటించింది. ఈ క్రమం లో శ్రీ గురూజీ ఫిబ్రవరి 1 న నాగపూర్ లో అరెస్ట్ చేయబడ్డారు. ఆ వెంటనే ఆనాటి స్వతంత్ర ప్రభుత్వం గాంధీ హత్యను సంఘం పై నెట్టి హత్య కారకులు సంఘమే నంటూ దుష్ప్రచారాన్ని ప్రారంభించింది. ఫిబ్రవరి 4 న సుమారుగా 170000 ల మంది స్వయంసేవకుల్ని అరెస్ట్ చేసి సంఘం పై నిషేదాన్ని విధించింది. ఈ సందిగ్ద పరిస్థితుల్లో శ్రీ గురూజీ ఫిబ్రవరి 5 న సంఘ శాఖ లన్నింటిని ఆపేయమని ప్రకటన చేశారు. అనంతరం ప్రభుత్వం తో చర్చలకు వెళ్లారు.
ప్రభుత్వం తో చర్చలు విఫలమయ్యాయి. ఆ వెంటనే స్వయం సేవకులు డిసెంబెర్ 9 న సంఘం పై విధించిన నిషేదాన్ని ఎత్తివేయాలంటూ “సత్యాగ్రహాన్ని ” ప్రారంభించారు.
1949…. ఈ సంవత్సరం లోనే గత అనుభవాల దృష్ట్యా “సంఘ సంవిధానాన్ని” తయారు చేశారు. జూలై 12 న ప్రభుత్వం సంఘంపై నున్న నిషేధాన్ని తొలగించింది. జూలై 13 న శ్రీ గురూజీ జైలు నుంచి విడుదలయ్యారు.
భారత్ ఆగుస్ట్ 15 న స్వాతంత్ర్యాన్ని పొందింది.
గాంధీ 14 సెప్టెంబర్ రోజున ఢిల్లీ లోని భాంగి కాలనీలో 500 మంది స్వయం సేవకుల నుద్దేశించి ప్రసంగించారు. 17 అక్టోబర్ రోజున పూజ్య గురూజీ కాశ్మీర్ ను బారత్ లో కలపాలని మహారాజ హరిసింగ్ ను కోరుతూ , ఒప్పించడానికి శ్రీనగర్ వెళ్లారు.
ఇదే సంవత్సరం “కెన్యా” దేశం లో స్వయంసేవకులు “భారతీయ స్వయంసేవక్ సంఘ్ ” పేరుతొ సంస్థ ను ప్రారంభించారు.
“ఆర్గనైజర్” మరియు “పాంచజన్య” వార పత్రికలు సంఘ అభిప్రాయాల్ని చెప్పడానికని ఈ సంవత్సరమే ప్రారంభించబడ్డాయి. వివిధ దేశ హిత అంశాలపైన మన అభిప్రాయాలను ప్రకటించడం ప్రారంభించాయి.
1948…. జనవరి 30 న గాంధీ హత్య
గావించబడ్డారు. ఆ దుశ్చర్యను నిరసిస్తూ సంఘం తన ప్రగాడ సంతాపాన్ని ప్రకటించింది. ఈ క్రమం లో శ్రీ గురూజీ ఫిబ్రవరి 1 న నాగపూర్ లో అరెస్ట్ చేయబడ్డారు. ఆ వెంటనే ఆనాటి స్వతంత్ర ప్రభుత్వం గాంధీ హత్యను సంఘం పై నెట్టి హత్య కారకులు సంఘమే నంటూ దుష్ప్రచారాన్ని ప్రారంభించింది. ఫిబ్రవరి 4 న సుమారుగా 170000 ల మంది స్వయంసేవకుల్ని అరెస్ట్ చేసి సంఘం పై నిషేదాన్ని విధించింది. ఈ సందిగ్ద పరిస్థితుల్లో శ్రీ గురూజీ ఫిబ్రవరి 5 న సంఘ శాఖ లన్నింటిని ఆపేయమని ప్రకటన చేశారు. అనంతరం ప్రభుత్వం తో చర్చలకు వెళ్లారు.
ప్రభుత్వం తో చర్చలు విఫలమయ్యాయి. ఆ వెంటనే స్వయం సేవకులు డిసెంబెర్ 9 న సంఘం పై విధించిన నిషేదాన్ని ఎత్తివేయాలంటూ “సత్యాగ్రహాన్ని ” ప్రారంభించారు.
1949…. ఈ సంవత్సరం లోనే గత అనుభవాల దృష్ట్యా “సంఘ సంవిధానాన్ని” తయారు చేశారు. జూలై 12 న ప్రభుత్వం సంఘంపై నున్న నిషేధాన్ని తొలగించింది. జూలై 13 న శ్రీ గురూజీ జైలు నుంచి విడుదలయ్యారు.
వారి విడుదల సందర్భంగా అశేష జనవాహిని వారికి ఎదురెల్లి ఘన స్వాగతం
పలికింది. అలా వారు దేశ వ్యాప్తంగా సుడిగాలి పర్యటన చేయగా వచ్చిన
కార్యకర్తల , అభిమానుల , ప్రజాప్రభంజనం యొక్క స్పందన స్వాగతాలు న భూతో ..న
భవిష్యతి…
“యువ శక్తే జాతి శక్తి ” అనే నినాదం తో విద్యార్ధి ఆధారంగా జాతి నిర్మాణ
కార్యమే లక్ష్యంగా “అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ” ABVP ఈ సంవత్సరమే
ఏర్పడింది.
1950…. జనవరి
26 న భారత్ గణతంత్ర రాజ్యమయ్యింది. శ్రీ గురూజీ ఈ దినాన్ని ఉత్సవంగా
జరుపుకోవాలని స్వయంసేవకులకు సూచించారు. మార్చ్ లో మొదటి అఖిల భారతీయ
ప్రతినిధి సభ జరిగింది.
గో
ఆ సభ లో శ్రీ భయ్యాజి దాని సంఘ ” సర్ కార్యవాహ “గా ఎన్నుకోబడ్డారు.
పాకిస్తాన్ నుండి వచ్చిన హిందూ శరణార్ధుల కోసం “వస్తు హర సహాయత సమితి”
ఏర్పడింది. ఈ ఏడాదే అస్సాం లో భూకంపం వరదలు వచ్చాయి. వెంటనే స్వయం
సేవకులు రంగం లోకి దిగి తక్షణ సహాయక చర్యల్ని చేపట్టారు.
1952….
….. గోహత్యను
నిషేదించాలని, గోహింసకు స్వస్తి చెప్పాలని ” గోరక్ష ఉద్యమం ” ప్రారంభ
మయ్యింది. ఈ కార్యక్రం కోసం స్వయం సేవకులు 1,75,39,813 సంతకాలను దేశం లోని
ప్రతీ ప్రాంతం నుండి సేకరించారు. అందులో 8,5000 పట్టణాలు, గ్రామాలూ
వున్నాయి.
సేకరించిన సంతకాలను నాటి గౌరవ రాష్ట్రపతి డా. రాజేంద్ర ప్రసాద్ గారికి డిసెంబెర్ 8 న సమర్పించారు. ఈ సంవత్సరం లోనే ” వనవాసి కల్యాణాశ్రమ్ ” ప్రారంభమయ్యింది. అలాగే రాజకీయ క్షేత్రం లో మేలి మలుపుగా డా . శ్యాం ప్రసాద్ ముఖర్జీ గారి నాయకత్వం లో అనేక మంది స్వయం సేవకుల సహకారం తో ” భారతీయ జన సంఘ్ ” ప్రారంభమయ్యింది.
స్వాతంత్ర్య వీరసావర్కర్ ఆధ్వర్యం లో నాడు ప్రారంభ మైన ” అభినవ భారత్ ” అనే సంస్థ యొక్క ముగింపు సమావేశం లో శ్రీ గురూజీ పాల్గొన్నారు.
1953…. జూన్ 23 న శ్రీ శ్యాం ప్రకాష్ ముఖర్జీ జమ్మూ లో ఆకస్మికంగా ,అనుమాన స్పదంగా మన నుంచి దూర మయ్యారు. వారి నిష్క్రమణ మనకు తీరని లోటు.
సేకరించిన సంతకాలను నాటి గౌరవ రాష్ట్రపతి డా. రాజేంద్ర ప్రసాద్ గారికి డిసెంబెర్ 8 న సమర్పించారు. ఈ సంవత్సరం లోనే ” వనవాసి కల్యాణాశ్రమ్ ” ప్రారంభమయ్యింది. అలాగే రాజకీయ క్షేత్రం లో మేలి మలుపుగా డా . శ్యాం ప్రసాద్ ముఖర్జీ గారి నాయకత్వం లో అనేక మంది స్వయం సేవకుల సహకారం తో ” భారతీయ జన సంఘ్ ” ప్రారంభమయ్యింది.
స్వాతంత్ర్య వీరసావర్కర్ ఆధ్వర్యం లో నాడు ప్రారంభ మైన ” అభినవ భారత్ ” అనే సంస్థ యొక్క ముగింపు సమావేశం లో శ్రీ గురూజీ పాల్గొన్నారు.
1953…. జూన్ 23 న శ్రీ శ్యాం ప్రకాష్ ముఖర్జీ జమ్మూ లో ఆకస్మికంగా ,అనుమాన స్పదంగా మన నుంచి దూర మయ్యారు. వారి నిష్క్రమణ మనకు తీరని లోటు.
1954….స్వయం సేవకులు పోర్చ్ గ్రీస్ ఆధీనం లో వున్న దాద్రా నగర్ హవేలిని ముట్టడించి ఆగుస్ట్ 2 న విముక్తి చేశారు.
1955…. అలాగే అఖిల పక్ష పోరాటంలో భాగంగా పోర్చుగీసు ఆధీనం నుండి గోవాను విముక్తి చేయడానికి పెద్దఎత్తున స్వయంసేవకులు పాల్గొన్నారు.
కార్మిక రంగం లో నేడు అత్యంత ప్రభావ శీలి సంఘంగా ప్రంపంచ వ్యాప్తంగా మన్ననలు పొందిన మాననీయ దత్తోపంత్ టేన్గిడీ మార్గదర్శనం లో వారి ఆలోచనల ప్రతిబింబంగా ” భారతీయ మజ్దూర్ సంఘ్” ప్రారంభమయ్యింది.
1956…
………………. ఇది శ్రీ ఏక్ నాథ్ జీ రనడే “సర్ కర్యవాహ ” గా ఎన్నుకోబడిన సంవత్సరం. శ్రీ గురూజీ యొక్క 51 వ జన్మ దినాన్ని పురస్కరించుకుని స్వయం సేవకులు ఇంటింటి తలుపు తడుతూ సంఘాన్ని సమాజానికి పరిచయం చేసే కార్యక్రమాన్ని తీసుకున్నారు.మాటి మాటి కి భారత్ ను తన మాటలతో బెదిరిస్తున్న చైనా ను గురూజీ తీవ్రంగా హెచ్చరించారు.
1959… అనంతరం “అఖిల భారతీయ కర్యకారిణి మండల్ ” లో చైనా దురాక్రమణ యత్నాలు ,హెచ్చరికలు ,పన్నాగాల గురించి సమీక్షించారు. ఎలాంటి పరిస్థితులు ఎదురైనా సంఘటితంగా ఎదుర్కోవడానికి జాతి సిద్దంగా వుండాలని మండల్ కోరింది.
1962…
….. ప. పూ. డా. హెడ్గెవార్ సమాధి పై పుష్పమాలనుంచి అంజలి గటిస్తున్న శ్రీ గురూజీ.
డా. హెడ్గెవార్ స్మారక మందిరం ఈ సంవత్సరమే ప్రారంభించబడినది.
జనరల్ కరియప్ప సంఘ శాఖ ను సందర్శించి చాలా సంభ్రమాశ్చర్యాలకు లోనయ్యారు. శాఖ లో నిర్వహింపబడుతున్న అనేక కార్యక్రమాల్ని ప్రత్యక్షంగా వీక్షించారు. సంఘ క్రమశిక్షణ , పథసంచలన్ వారికి ఏంటో నచ్చాయి.
శ్రీ భయ్యాజి దానీ ” సర్ కార్యవాహ ‘ గా ఎన్నికయ్యారు.
1962 లో చైనా బహిరంగంగా మన దేశ సరిహద్దుల్లోకి చొచ్చుకొచ్చి మనల్ని సవాల్ చేసిన సందర్భం లో స్వయం సేవకులు రంగం లోకి దిగి మన ప్రభ్త్వ దళాలకు వెన్నంటి వుంటూ సహకారాన్ని అందించారు .. అలాగే సైనకులకు తోడుగా వున్నారు.
1963…
ఈ సంవత్సరం లోనే సంఘాన్ని ప్రభుత్వం ధిల్లీ “రిపబ్లిక్ డే పరేడ్ “ లో కవాతుకు ఆహ్వానించింది .ఆ సందర్భంగా ౩౦౦౦ ల మంది స్వయం సేవకులు పూర్ణ గణవేష ధరించి ఘోష్ యుక్తంగా బ్రంహాండ మైన ” పథ సంచలన్ ” ( కవాతు ) చేశారు. అశేష జనవాహిని కనులార వీక్షించి సంఘ క్రమశిక్షణ ,కవాతు చేసిన తీరుకు సంభ్రమాచ్చార్యలను వెలుబుచ్చారు. సంఘ కౌశలాన్ని కొనియాడారు.
స్వామి వివేకానంద జన్మ శతాబ్ది ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. దేశ వ్యాప్తంగా కార్యక్రమాలు జరిగాయి. అదే సందర్భం లో స్వామి వివేకానంద జ్ఞాపకార్ధం ఏదైనా చేయాలనే సంకల్పం తో ” కన్యాకుమారి వద్ద భవ్యమైన స్వామివారి స్మ్రుతిమందిరం ” నిర్మించాలని సంఘం తీర్మానించింది.
శ్రీ గురూజీ నేపాల్ సందర్శించి అక్కడి రాజు తో హిందువుల మరియు హిందుత్వ కు సంబంధించి సుధీర్గ చర్చలు జరిపారు. వారికి రాజు తో ఎంతో సాన్నిహిత్యం వుండేది.
1964…
హిందువుల మనోభావాలకు ప్రతీకగా హిందూ ధర్మ సంరక్షణా కార్యార్థమై “విశ్వ హిందూ పరిషద్ ” ఆవిర్భావం జరిగింది.
1965…
పాకిస్తాన్ భారత్ పై దాడి చేసింది. అప్పటి ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి శ్రీ గురూజీ ని అఖిల పక్ష సమావేశానికి ఆహ్వానించారు. డిల్లీ లో జరిగిన ఈ సమావేశం లో శ్రీ గురూజీ సంఘ్ వైపు నుండి సంపూర్ణ మద్దతును తెలియజేశారు.
……….. ఇదే స్సంవత్సరంలో మాన్య బాలా సాహెబ్ దేవరస్ ( శ్రీ మధుకర్ దత్తాత్రేయ దేవరస్ )
గారు సంఘ “సర్ కార్యవాహ “గా ఎన్నికయ్యారు. ఈ సంవత్సరం లోనే నాగపూర్ – విదర్భ ప్రాంతిక్ భైటక్ జరిగింది. ఇందులో 5000 ల మంది స్వయం సేవకులు పాల్గొన్నారు.
1966…
బీహార్ లో కరువు సంభవించింది. స్వయం సేవకులు సహాయక చర్యల్లో చురుగ్గా పాల్గొన్నారు. స్వయం సేవకుల నిస్వార్ధ సేవ కు ప్రభావితులైన జయ ప్రకాష్ నారాయణ్ సంఘాన్ని ” RSS means Ready for Selfless Service ” అని కీర్తించారు.
మొదటి “విశ్వ హిందూ సమ్మేలన్ ‘ ప్రయాగలో జరిగింది. దానికి ముందు జరిగిన ప్రయాగ సమ్మేలన్ సమాయత్త సమావేశాన్ని పై చిత్రం లో చూడవచ్చు.
1967…
మహారాష్ట్ర ప్రాంత శిబిరం లో 10000 లకు పైన స్వయం సేవకులు పాల్గొన్నారు.
1968…
షాజపూర్ లో మధ్యప్రదేశ్ ప్రాంత శిబిరం జరిగింది.
1971…
విదర్భ - నాగపూర్ ప్రాంత శిబిరం లో 10000 ల మందికి పై గా స్వయం సేవకులు పాల్గొన్నారు. మూడోసారి పాకిస్తాన్ తో సంభవించిన యుద్ధం లో స్వయం సేవకులు సైనికులకు సహకరించడం లో క్రియాశీల పాత్ర పోషించారు .
1972…
” దీన్ దయాల్ శోధనా సంస్తాన్ ” ఏర్పాటైంది. మన తొలి ప్రచారకులు శ్రీ బాబా సాహెబ్ ఆప్టే మన నుంచి దూరమయ్యారు.
1973…
శ్రీ గురూజీ జూన్ 5 న మననుంచి దూరమయ్యారు. అలుపెరగని అవిశ్రాంత సామాజిక సమరయోధుని నిష్క్రమణ స్వయం సేవకుల్లో తీరని దు: ఖాన్ని నింపింది. అతని నిస్వార్ధ దేశ సేవ ఎంతో మంది యువకులకు మార్గదర్శన మయ్యింది. సంఘానికి అతనొక దివిటీ అయి వెలుగు దారి చూపాడు. నేనొక సాధారణ స్వయం సేవకున్నని నినదించారు.
జూన్ 6 న శ్రీ బాలసాహెబ్ దేవరస్ సంఘ 3 వ ” సర్ సంఘ చాలక్ ” గా నియమింప బడ్డారు.
శ్రీ మాధవ రావ్ ములే సంఘ ” సర్ కార్యవాహ ” గా ఎన్నుకోబడ్డారు.
1974… ఛత్రపతి శివాజీ పట్టాభిశక్తుడై 300 ల ఏళ్ళు ఐన సందర్భంగా సంఘం ఘనంగా ఉత్సవాలను నిర్వహించింది.
1975… జూన్ 5 న దేశంలో ఇందిరా గాంధీ ఎమర్జెన్సి విధించింది. ఆ వెంటనే ఆమె ప్రభుత్వం జులై 4 న సంఘం పై రెండవ సారి “నిషేదాన్ని “ విధించింది. ఈ సందర్భంలో ఇందిరా యొక్క అప్రజాస్వామిక చర్యలకు వ్యతిరేకంగా పోరాటం చేయడానికి ” అఖిల భారతీయ లోక్ సంఘర్షణ సమితి ” ఏర్పాటయ్యింది. బాలాసాహెబ్ జీ అరెస్ట్ చేయబడ్డారు. సంఘ నాయకులెందరో అజ్ఞాతం లోకి వెళ్లారు. కార్యకర్తల పనంతా అండర్ గ్రౌండ్ లోనే సాగింది.
1977… అధికారం లోనికి వచ్చిన జనతా పార్టీ లో భారతీయ జన సంఘ్ విలీన మయ్యింది . మార్చ్ 22 న సంఘం పై నిషేధం తొలగించ బడినది. జయప్రకాష్ నారాయణ్ గారు పాట్న లో నవంబర్ 3 న RSS సమావేశం ను ఉద్దేశించి ప్రసంగించారు.
డిసెంబెర్ లో తుఫాన్ కారణంగా ఆంధ్ర ప్రదేశ్ లో వచ్చిన వరదలు అపార ప్రాణ ఆస్తి నష్టాన్ని కలిగించాయి. అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో స్వయం సేవకులు సహాయక చర్యల్ని చేపట్టి శిభిరాల్ని నిర్వహించారు. 2,40,000 జతల బట్టల్ని , 3200 నిత్యావసర మరియు ఆహార పోట్లాలలను అందించారు.
శ్రీ రాజేంద్ర సింహ్ గారు సహా సర్ కార్యవాహ గా భాద్యతల్లోకి వచ్చారు.
1978… సెప్టెంబర్ 30 న సర్ కార్యవాహ మాననీయ మాధవరావ్ ములే స్వర్గస్తులై నారు.
శ్రీ రాజేంద్ర సింహ్ ఆలియాస్ రాజ్జుభయ్య సంఘ” సర్ కార్యవాహ ” గా
ఎన్నుకోబడ్డారు. 1978 లో మధ్య భారత్ ప్రాంత శిబిరం జరిగింది . ఈ శిబిరంలో
6000 ల వరకు స్వయం సేవకులు పాల్గొన్నారు.
1980… ఒక కోటి కుటుంబాలను , 9500 గ్రామాలను కలిసే బృహత్తర కార్యక్రమాన్ని సంఘం ” జన సంపర్క అభియాన్ ” పేరుతొ ప్రారంభించింది.
సంఘం లో మరియు జనతా పార్టీ లో ఏక కాలం లో సభ్యుడిగా ఉండరాదన్న జనతా పార్టీ వాదన నుండి ” భారతీయ జనతా పార్టీ ” పురుడు పోసుకుంది.
1981… తమిళనాడు లోని మీనాక్షి పురం లో ఫిబ్రవరి మాసంలో 800 ల మంది హిదువులు ముస్లిం లు గా మతమార్పిడి చేయ బడ్డారు. సంఘం ఈ విషయమై స్పందించి వివిధ హిందూ సంస్థల తో కలిసి తమిళనాడు మరియు దేశం లోని ఇతర ప్రాంతాల్లో నిరసన కార్యక్రమాన్ని చేపట్టింది. మతమార్పిడుల్ని వ్యతిరేకిస్తూ జాతీయ స్థాయిలో ప్రచార కార్యక్రమాన్ని తీసుకుంది.
1982… కర్ణాటక ప్రాంత శిబిరం బెంగళూర్ లో జరిగింది. సుమారు 25000 ల మంది స్వయం సేవకులు పాల్గొన్నారు.
1983… భారత్ మాత మరియు గంగా మాత ల యెడ భక్తి ప్రపత్తులు పెంచేలాగున మరియు ప్రజల్లో దేశభక్తి ని ప్రేరేపించుటకై స్వయం సేవకుల సహకారం తో విశ్వ హిందూ పరిషత్ ” ఏకాత్మతా యజ్ఞాన్ని ” ప్రారంభించింది.
పూణే లో మహారాష్ట్ర ప్రాంత శిబిరం జరిగింది. 35000 ల మంది స్వయం సేవకులు పాల్గొన్నారు.
1984… అక్టోబర్ లో జరిగిన ఇందిరాగాంధీ హత్య అనంతరం ధిల్లీ లో సిక్కుల ఊచకోత జరిగింది. అపార ఆస్తి ప్రాణ నష్టం కలిగింది. ఆ సందర్భంగా వందల సిక్కు కుటుంబాలు స్వయం సేవకుల ఇళ్ళల్లో రక్షణ తీసుకున్నాయి. డిల్లి పుర వీధుల్లోని సిక్కుల ఇళ్ళ వెంట అనేక నిత్యావసర ఇత్యాది సహాయ శిబిరాల్ని ఏర్పరిచారు. దేశ వ్యాప్తంగా అనేక చోట్ల ఈ కార్యక్రమాన్ని సంఘం నిర్వహించింది. సిక్కుల కు రక్షణ గా నిలిచింది.
1985… ఇన్ని ఒడుదొడుకుల మధ్య సంఘం షష్టి పూర్తి చేసుకుంది. అరవై వసంతాల మెయిలు రాయిని చేరుకుంది. ఈ సందర్భంగా దేశ వ్యాప్తంగా అనేక కార్యక్రమాలు జరిగాయి.
1986… త్రివేండ్రం లో హిందూ సంఘం జరిగింది.
1987…
…… శ్రీ శేషాద్రి గారు సర్ కార్యవాహ గా ఎన్నికయ్యారు. డిసెంబెర్ 6 న పూజ్య సర్ సంఘ్ చలాక్ స్థాయిలో శ్రీ బాలసాహెబ్ జీ చైతన్య భూమి ని సందర్శంచి డా. అంబేద్కర్ ని స్మరిస్తూ శ్రద్దాంజలి ఘటించారు.
1988… డాక్టర్జీ జన్మ శతాబ్ది ఉత్సవాలు ” జన సంపర్క అభియాన్ ” పేరు తో ఘనంగా ప్రారంభ మయ్యాయి . స్వయం సేవకులు ఈ సందర్భంగా 150000 కుటుంబాలను కలిసి , 76000 ల సమావేశాలు నిర్వహించి 11 కోట్ల రూపాయల సేవా నిధిని సేకరించడం జరిగింది.
1989 …
………… జూన్ 25 న మోగా పట్టణం లో శాఖ పైన తీవ్రవాదుల దాడి జరిగింది . దీని కారణంగా 18 మంది స్వయం సేవకులతో పాటు ఇతరులు 6 గురు దుర్మరణం చెందారు. 28 మంది గాయ పడ్డారు.
1990 … అక్టోబర్ 30 న అయోధ్య లోని రామజన్మ భూమి వద్ద కరసేవ కార్యక్రమం జరిగింది. కానీ విని ఎరగని రీతిలో లక్షలాది కరసేవకులు ములాయం సింగ్ ప్రభుత్వం కలిగించిన అన్ని ఆటంకాలను దాటి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
1992 … మాన్య బావు రావ్ దేవరస్ జీ మే 14 న మన నుంచి దూరమయ్యారు. అదే సంవత్సరం ఆగస్ట్ 20 న శ్రీ యదవరావ్ జోషిజీ కుడా మరణించడం కార్యకర్తల్లో తీవ్ర దు:ఖా న్ని నింపింది.
డిసెంబెర్ 6 న, రామ మందిరం పై పూర్వం నిర్మించబడిన బాబ్రి మసీద్ ను తొలగించడం జరిగింది. దీంతో ప్రభుత్వం సంఘం పై డిసెంబెర్ 10 న మూడోసారి నిషేదాన్ని విధించింది.
1993 … జూన్ 4 న బహ్రి ట్రిబునల్ సంఘంపైన వచ్చిన అన్ని ఆరోపణల్ని కొట్టివేయగా నిషేధం తొలగించ బడింది.
1994 …
జూన్ 17 న శ్రీ బాలా సాహెబ్ జీ మన నుంచి దూరమయ్యారు.
నవంబెర్ లో గోదావరి జిల్లాల్లో తీవ్రమైన తుఫాన్ కారణంగా 900 మంది చనిపోయారు. ప్రకృతి సృష్టించిన బీభత్సం కారణంగా ఆస్తి ప్రాణ నష్టం వల్ల నిరాశ్రయులైన ప్రజల పాలిట ఆపన్న హస్తంగా సంఘం “జన సంక్షేమ సమితి ” పేరు తో పెద్ద ఎత్తున సహాయక శిభిరాల్ని ప్రారంబించింది. తక్షణ సహకారాన్ని అందించింది.
హర్యానా కు సమీపం లోని చక్రి దాద్రి వద్ద జరిగిన విమాన దుర్ఘటన లో 350 మంది మరణించారు. ఈ సందర్భంగా స్వయం సేవకులు అక్కడ చేపట్టిన సహాయక చర్యలను చూసి అంతర్జాతీయ పత్రికా రంగం ఎంతో కీర్తించింది. ఎందరో ముస్లిం మృతదేహాలని వారి డబ్బు ఆభరణాలు అన్నింటి ని పద్దతి ప్రకారం వారి వారి కుటుంబాలకు అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా గల్ఫ్ దేశ పత్రికలు , ప్రభుత్వాలు సంఘానికి కృతఙ్ఞతలు తెలియ జేశాయి. సంఘం చేసిన విలువైన సేవను కొనియడాయి.
1997 … జనవరి 10 నుండి 17 తేదీ ల్లొ హిందూ కౌన్సిల్ ఆఫ్ కెన్యా ఆహ్వానం మేరకు శ్రీ రజ్జు భయ్యా కెన్యా పర్యటన వెళ్లారు. ఈ పర్యటన లో వారు అనేక భారతీయ కుటుంబాలను కలిసారు. యునివర్సిటి విద్యార్థులను మరియు ప్రభుత్వ అధికారుల్ని కలిసారు.
స్వర్ణోత్సవ సంఘ సమాగమం లుధియానా లో జరిగింది . ఒక రోజు కార్యక్రమం లో 21000 మంది స్వయం సేవకులు పాల్గొన్నారు.
1998 … ఏప్రిల్ 17 న శ్రీ రాజ్జుభయ్య జపాన్ దేశాన్ని సందర్శించారు. అక్కడ ఇండో – జపాన్ సాంస్కృతిక కేంద్ర నిర్మాణానికి భూమి పూజ చేశారు.
డిసెంబెర్ 25 న ముంబై లో ABVP స్వర్ణోత్సవాలు ప్రారంభ మయ్యాయి.
1999 … ఏప్రిల్ మాసం లో సిక్కుల 10 వ గురువు శ్రీ గురుగోబింద్ సింగ్ చే ప్రారంభించబడిన ” ఖల్సా పంత్ ” యొక్క త్రి శతి వసంతోత్సవాలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భాన్ని అన్ని శాఖ ల్లొ గుర్తుచేసుకుని ఉత్సవాలు జరపాలని సంఘం నిర్ణయించింది. స్వయం సేవకులు ఆ మేరకు అనేక కార్యక్రమాలు నిర్వహించారు.
ఆగుస్ట్ 6 న త్రిపుర లో NLFT మిలిటెంట్ లు నలుగురు ‘ప్రచారకులు మరియు పుర్నావధి కార్యకర్తల్ని’ అపహరించారు. 2 కోట్ల మొత్తాన్ని అప్పజెప్పాలని డిమాండ్ పెట్టారు. అనంతరం ఆ నలుగుర్ని దారుణంగా చంపేశారు.
ఈ శతాబ్దం లోనే అత్యంత భయానకమైన తుఫాన్ ఒకటి అక్టోబర్ 28 న ఒరిస్సా ను కబళించింది. అందు కారణంగా 10000 ల మంది మరణించగా 1800 కోట్ల రూపాయల ఆస్థి నష్టం సంభవించింది. ఈ క్రమం లో సంఘం ప్రధాన పాత్ర పోషిస్తూ ” ఉత్కల్ బిపన్న సహాయత సమితి ” ని ఏర్పరచి పునరావాస కార్యక్రమాల్ని పెద్ద ఎత్తున ప్రారంభించింది.
2000 … జనవరి లో 3 రోజుల స్వయం సేవకుల సంకల్ప శిబిరం గుజరాత్ లో జరిగింది. ఈ కార్యక్రమం లో 26000 ల మంది స్వయం సేవకులు పాల్గొన్నారు.
సంఘ్ 75 వసంతాలు పూర్తి చేసుకుంది. పెద్ద ఎత్తున ప్రజల్లోకి వేల్లెదానికి ” జన జాగరణ అభియాన్ ” కార్యక్రమాన్ని తీసుకుంది. దేశం లోని ప్రతీ ఇంటికి సంఘ సందేశం చేరవేయడం దీని లక్ష్యం. దిగ్విజయంగా లక్ష్యాన్ని చేరుకొని కార్యక్రమాన్ని సుసంపన్నం చేసింది.
అక్టోబర్ లో బ్రజ్ ప్రాంత రాష్ట్ర రక్షా మహా శిబిరం జరిగింది. ఆగ్రా లో జరిగిన ఈ కార్యక్రమం లో 49000 వేల మంది పాల్గొన్నారు.
2001 … సరిగ్గా గణతంత్ర దినం రోజే అనగా 26 జనవరి న మున్నెన్నడూ ఎరగని రీతిలో భూకంపం వచ్చింది. వెంటనే స్వయం సేవకులు అందరికంటే ముందుగానే చేరు కొని సహాయ కార్యక్రమాల్లో నిమగ్నమయ్యారు. మొత్తం 35000 మంది కార్యకర్తలు చివరంటా బాదితుల వెంట ఉండి పునరావాస కార్యక్రమాలు నిర్వహించారు. .
51000 మంది స్వయం సేవకులతో జైపూర్ లో ” రాష్ట్ర శక్తి సంగం ” పేరుతొ పతసంచలన్ జరిగింది.
2002 … 39000 ల మంది కార్యకర్తలతో ” సమరసతా సంగం ‘ పేరుతొ దక్షిణ కర్ణాటక ప్రాంతీయ శిబిరం బెంగళూర్ లో జరిగింది.
2003 … సంఘ జ్యేష్ట కార్యకర్తల్లో ఒకరైన శ్రీ మోరోపంత్ పింగ్లే ఈ సంత్సరమే పరమ పాడించారు. అలాగే శ్రీ రజ్జు భయ్యాజి కూడా ఈ సంవత్సరమే కాలం చేసారు.
2006-07 … శ్రీ గురూజీ జన్మ శతాబ్ది ఉత్సవాలు దేశ వ్యాప్తంగా ఘనంగా జరిగాయి.
No comments:
Post a Comment