Thursday, February 16, 2012

మానవత రూప ధర్మము నెన్నడు విడువరాదు



మననశీలుడై, తనకు వలెనే ఇతరులకు సుఖదుఃఖములు, హాని, లాభములు కలుగునని ఎంచువానినే మనుష్యుడనవలయును. మనుష్యుడెన్నడు నన్యాయమొనర్చు బలవంతునకు గూడ భయపడరాదు. ధర్మాత్ముడయిన  నిర్బలుని నుండియు భయపడవలయును. ఇంతేకాక, మిక్కిలి యనాథులు, నిర్బలులు, గుణ రహితులు నైన ధర్మాత్ములను రక్షించి వారి యున్నతి కొరకు పాటుపడవలయును. వారియెడ బ్రేమతో వర్తింపవలయును.  అధార్మికుడు చక్రవర్తియైనను, సనాతుడు, బలవంతుడు, గుణవంతుడు నైనను వాని నాశము కొరకు, నవనతి  కొరకు బ్రయత్నింపవలయును.  అతని యెడ బ్రియాచరణమెన్నడు చేయరాదు. అనగా జేతనైనంత వరకు నన్యాయకారులను బలహీనులను చేయుటకు, న్యాయాచరణ పరుల బలమును పెంచుటకును సర్వదా యత్నింపవలయును.  ఈ కార్యమున నతని కెంతటి దారుణ దుఃఖము సహింపవలసి వచ్చినను నీ మానవత రూపధర్మము నెన్నడు విడువరాదు. 
- సత్యార్థ ప్రకాశిక నుండి

No comments:

Post a Comment