భారత మార్కెట్లోకి అడుగిడాలని అమెరికా సంస్థలు తహతహలాడుతున్నాయి. భారత మల్టీ బ్రాండ్ రిటైల్ తదితర రంగాల్లో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్.డి.ఐ.) అనుమతించే అంశంపై వ్యతిరేకత వ్యక్తమవుతున్న నేపథ్యంలో వాల్ మార్ట్, స్టార్ బుక్స్, ఫ్రుడెన్షియల్ ఫైనాన్షియల్ తదితర అమెరికన్ సంస్థలు పెద్ద ఎత్తున లాబీయింగ్ జరుపుతున్నట్లు సమాచారం.
భారత్
లో తమ వ్యాపార విస్తరణ పథకాలకు అమెరికా ప్రభుత్వం నుంచి మద్దతు
కూడగట్టేందుకు ఇవి శాయశక్తులా కృషి చేస్తున్నాయి. భారత్ లో ఎఫ్.డి.ఐ.లకు
అనుమతి కోసం గత ఏడాది కాలంగా యు.ఎస్. కంపెనీలు, పారిశ్రామిక వర్గాలు
కోట్లాది డాలర్లు ఖర్చు చేసినట్లు ప్రతినిధుల సభ, సెనేట్ కు సమర్పించిన
తాజా లాబీయింగ్ నివేదికల ద్వారా తెలియవచ్చింది.
No comments:
Post a Comment