భారతదేశం ఆర్థికంగా శక్తివంతం కావాలంటే గ్రామాలు శక్తివంతం కావాలి. గ్రామాలు శక్తివంతం కావాలంటే వ్యవసాయ రంగం శక్తివంతం కావాలి. అందుకే గాంధీజీ దేశానికి స్వాతంత్ర్యం వచ్చింది, ఇంకా రావలసింది గ్రామ స్వరాజ్యం అని చెప్పారు. ఈ రోజున గ్రామ స్వరాజ్యం రాజకీయ కబంధ హస్తాలలో చిక్కుకొంది. ఆ కారణంగా గ్రామాలు కళా విహీనమై పోతున్నాయి. ప్రజలు పొట్ట చేతబట్టుకొని పట్టణాల వైపు తరలుతున్నారు. పట్టణాలు జనారణ్యాలుగా మారిపోతున్నాయి. ఈ పరిస్థితులను చక్కదేద్దేందుకు వ్యవసాయ రంగం దాని అనుబంధ వృత్తుల వికాసము కొరకు ప్రభుత్వాలు ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వవలసి ఉంది. గ్రామీణ క్షేత్రం స్వయంసమృద్ధి సాధించవలసి ఉంది. అప్పుడే ఈ దేశం నిజమైన శక్తివంతమైన దేశంగా తీర్చిదిద్దబడుతుంది. అటువంటి మార్పు సాధించుటకు అందరం కృతనిశ్చయులం కావాలి.
Tuesday, October 9, 2012
గ్రామ వికాసమే దేశ వికాసం

Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment