2012 తృతీయవర్ష సంఘ శిక్షావర్గలో పాల్గొన్న స్వయంసేవకులు |
రాష్ట్రీయ స్వయంసేవక సంఘంలో కార్యకర్తలకు శిక్షణ అనేది ఒక విశేషమైన యోజన. కార్యకర్తలకు సంఘ సిద్ధాంతము, కార్యపధ్ధతి, దేశం యొక్క సమగ్రత, ఈ దేశ మహాపురుషుల ప్రేరణదాయక విషయాలు మొదలైన విషయాలు అవగాహన కలిగించేందుకు ప్రయత్నిస్తారు. ఈ సంవత్సరం తృతీయవర్ష నాగపూర్ లో మే 13వ తేదీన ప్రారంభమై జూన్ 12 ఉదయం దీక్షాంత సమారోప్ తో పూర్తి అయ్యింది.
దేశం మొత్తం నుండి 1013 మంది శిక్షార్థులు పాల్గొన్నారు. పశ్చిమ ఆంధ్ర ప్రదేశ్ నుండి 52 మంది శిక్షార్థులు పాల్గొన్నారు. మలేషియా, నేపాల్, అమెరికా దేశాల నుండి 5 గురు శిక్షార్థులు పాల్గొన్నారు. కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు, కచ్ నుండి కామరూప్ వరకు దేశవ్యాప్తంగా ఉన్న అన్ని భాషల వాళ్ళు వర్గలో పాల్గొన్నారు. ఒకరి భాష ఒకరికి సరిగా అర్థం కాకపోయినా హావభావాలతో ఆత్మీయంగానే కలిసిపోయారు. సంఘ కార్యం దేశవ్యాప్తంగా ఉన్నది అనే అనుభూతి, దేశ సమగ్రత గురించి, దేశ వ్యాప్తంగా పని చేస్తున్నాము అనే విశ్వాసం, సైద్ధాంతిక సమగ్రతను అర్థం చేసుకోవటం, సమన్వయ భావం నిర్మాణం చేయటం తృతీయవర్ష ప్రత్యేకత.
నాగపూర్ రేశంభాగ్ మైదానంలో 1928 నుంచి శిక్షావర్గ నడుస్తున్నది. ఇది 81వ శిక్షావర్గ. పూజనీయ సర్ సంఘచాలక్ 6 రోజులపాటు వర్గలో ఉండి శిక్షార్థులకు మార్గదర్శనం చేశారు.
జూన్ 11వ తేదీనాడు సార్వజనికోత్సవం జరిగింది. ఆ కార్యక్రమంలో పంజాబు కేసరి పత్రిక సంపాదకులు శ్రీ అశ్వనీ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొనగా, శ్రీ మోహన్ జీ భాగవత్ ముఖ్య వక్తగా ప్రసంగించారు.
శ్రీ అశ్వనీ కుమార్ మాట్లాడుతూ "స్వతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాలైనప్పటికీ పాకిస్తాన్ ఆక్రమణలో ఉన్న కాశ్మీర్ భూభాగాన్ని ఎందుకు విముక్తి చేయలేకపోయాం? దిగజారుతున్న దేశ ఆర్ధిక వ్యవస్థ, దేశంలో అంతర్గతంగా, చైనా నుండి ఎదురవుతున్న సవాళ్ళను మనం ఎదుర్కోవాలి. దేశ అఖండత, సమైక్యతను కాపాడేందుకు మనం పని చేయాలి. మనకు ఎక్కువ సమయం లేదు" అని అన్నారు.
----------------------------------------------------------------------
ఖలిస్తాన్ ఉగ్రవాదులు పెట్రేగిపోయి, పని చేస్తున్న రోజులలో
పంజాబులోని పంజాబు కేసరి పత్రిక దేశ సమైక్యతకు, సమగ్రతకు ప్రాధాన్యమిచ్చి
పని చేసింది. అందుకుగాను ఎంతో మూల్యం చెల్లించింది. ప్రస్తుత సంపాదకులు
శ్రీ అశ్వనీ కుమార్ కు తాత అయిన లాల్ జగత్ నారాయణ, తండ్రి అయిన శ్రీ జగత్
ఉమేష్ చందర్ ఇద్దరూ ఉగ్రవాదుల తూటాలకు బలియైనారు. అయినా అధైర్యపడక "నా తాత,
తండ్రి అడుగుజాడలలోనే నా శరీరములో ప్రాణమున్నంత వరకు ఈ పత్రికను నడుపుతూనే
ఉంటాను, దేశ సమైక్యతా, సమగ్రతలకు పాటు పడుతూనే ఉంటాను" అని శ్రీ అశ్వనీ
కుమార్ ప్రకటించారు.
----------------------------------------------------------------------
శ్రీ మోహన్ జీ భాగవత్ సందేశం
ప్రపంచ దేశాలలో భారతదేశంలోని ప్రజలకు మాత్రమే తమ గుర్తింపు విషయంలో స్పష్టత లేదు. ఇది ఒక విచిత్రమైన పరిస్థితి. స్వాతంత్ర్య పోరాట కాలంలో ఈ దేశ ప్రజలలో ఈ దేశం గురించి స్పష్టత లేని కారణంగా 1947 ఆగస్టు 14న దేశం ముక్కలు చేయబడింది. ఈ రోజున కూడా ఈ దేశ ప్రజలందరిలో దేశం గురించి, జాతీయత గురించి స్పష్టత లేని కారణంగా అనేక సమస్యలు ఎదుర్కొంటున్నాము. డాక్టర్ అంబేద్కర్ రాజ్యాంగ సభలో ప్రసంగిస్తూ "ఈ దేశంమీద దురాక్రమణ చేసిన వాళ్ళు తమ పరాక్రమంతో ఇక్కడ గెలవలేదు. ఈ దేశ ప్రజలలో ఉన్న విభేదాలే వారి గెలుపుకు కారణమయ్యాయి. ఎన్నో త్యాగాలు, ఎంతో పరిశ్రమ చేసి ఇప్పుడు స్వాతంత్ర్యం సంపాదించుకొన్నాము. కాని మనలో విభేదాలు పూర్తిగా సమసిపోలేదు. విభేదాలు సమసిపోయి మనమందరం సోదరులం అనే భావనను గుర్తించలేకపోతే ఈ రాజ్యాంగం ఈ దేశాన్ని కాపాడలేదు" అని చెప్పారు.
రాష్ట్రీయ స్వయంసేవక సంఘం ఈ దేశ ప్రజలలో దేశభక్తి భావాన్ని నిర్మాణం చేయటానికి కృషి చేస్తున్నది. 1857 ప్రథమ స్వాతంత్ర్య సంగ్రామం తరువాత ఈ సమాజం యొక్క సంపూర్ణ పరివర్తన కోసం ప్రారంభించిన పనులు కొన్ని మధ్యలో ఆగిపోయాయి. వాటిని కొనసాగిస్తూ వారి కలలను సాకారం చేసేందుకు హిందూ సమాజాన్ని సంఘటన చేయాలి. సమాజమంతటా మనం పని చేయాలని మోహన్ భాగవత్ జీ పిలుపునిచ్చారు.

http://www.lokahitham.net/2012/02/blog-post_1178.html
No comments:
Post a Comment