శ్రీ పుచ్చలపల్లి సుందరయ్య ప్రముఖ మార్క్సిస్టు కమ్యూనిస్టు నాయకుడు. నిరాడంబరుడుగా పేరుబడ్డ ఈయనను తెలియని వారుండరు. శ్రీ సుందరయ్య తన ఆత్మకథలో ఇలా వ్రాసుకున్నారు. "శ్రీమద్ భగవద్గీత నాకు ఎంతో స్ఫూర్తి దాయకమైనది. అంతేగాక ఆర్.ఎస్.ఎస్. నాయకుడు శ్రీ గోళ్వాల్కర్ మాటలు, ఆయన వ్యక్తిత్వం నాలో దేశభక్తిని రగిలించాయి". హిందూ ధర్మ ఔన్నత్యం తననెంతో ప్రభావితం చేసిందని కూడా వారు పేర్కొన్నారు. కొంతమంది అగ్ర నక్సలైట్ నాయకులు కూడా వారి బాల్యంలో శాఖకు వెళ్ళినట్లు కొన్ని సందర్భాలలో పత్రికలలో చూశాం.
నా బొజ్జ నిండితే చాలు అదే శ్రీరామరక్ష
అనుకొనే కాలంలో ఎవరైనా సమాజాన్ని గురించి ఎందుకు ఆలోచించాలి? సాటి మనిషి
కష్టాలు పట్టించుకోవాలంటే
స్పందించే హృదయం కావాలి. స్పందించే హృదయం కావాలంటే దేశభక్తి ఉండాలి.
దేశభక్తి సంఘ శాఖలో మాత్రమే లభిస్తుంది. అదీ ఉచితంగా. పనిచేసే రంగమేదైనా
కావచ్చు. కానీ స్వార్ధాన్ని ప్రక్కన పెట్టి దేశాన్ని గురించి ఆలోచించాలంటే
ఒక్క సంఘ శాఖకే అది సాధ్యం. శ్రీ పుచ్చలపల్లి సుందరయ్య గారు తన ఆత్మకథలో ఈ
విషయాన్ని చెప్పారు.
ఈనాడు మన దేశంలో వివిధ రంగాలలో ఉన్నత స్థాయిలో ఉండి మంచి పేరు తెచ్చుకున్న
వారు ఎందఱో వారి బాల్యంలో నిక్కరు ధరించి శాఖకు వెళ్ళిన వారే. ఆ విషయం వారే
స్వయంగా వివిధ సందర్భాలలో చెప్పిన విషయం మనం వినే ఉంటాము.
http://www.lokahitham.net/2012/02/blog-post_2320.html
No comments:
Post a Comment