నాగపూర్ లోని ఇన్ కంటాక్స్ ట్రిబ్యునల్ ఒక కేసు విచారణలో తీర్పునిస్తూ హిందుత్వము అనేది మతం కాదని, శివుడు, హనుమంతుడు, దుర్గ మొదలైన దేవతలందరూ ప్రకృతిలోని శక్తులని, ఈ దేవతలందరూ ఒక మతానికి చెందినవారుగా చెప్పలేమని చెప్పారు.
''శివుడు, హనుమంతుడు, దుర్గ మొదలైన
దేవాలయాల పూజల ఖర్చులు మతపరమైన ఖర్చులుగా భావించలేము'' అని ట్రిబ్యునల్
తీర్పునిచ్చింది. నాగపూర్ లోని ఒక శివాలయ కమిటీ వేసిన కేసుపై ట్రిబ్యునల్ ఈ
తీర్పునిస్తూ ఆ శివాలయ ఖర్చులకు ఇన్ కంటాక్స్ నుండి మినహాయింపు ఇవ్వాలని
చెప్పింది.
పూర్తి వివరాలకు మార్చి 17 నాటి నాగపూర్ టైమ్స్ లేదా ఆంధ్రజ్యోతి దినపత్రికలను చూడవచ్చు.
No comments:
Post a Comment