Friday, June 21, 2013

ఉత్తరాఖండ్ లో సహాయ చర్యలు ముమ్మరం: సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్న ఆర్మీ

    ఎక్కడ చూసినా ఆర్తనాదాలు.. రోదనలు.. ఆకలి కేకలు.. స్తంభించిన రవాణా వ్యవస్థ.. పనిచేయని మెబైల్స్.. తమవారు ఎక్కడ ఉన్నారో తెలియని స్థితి. కాపాడంటూ బాధితుల గోడు.. ఇది ఉత్తరాఖాండ్ లోని గంగమ్మ ఉగ్రరూపానికి కొట్టుమిట్టడుతున్న వారి పరిస్థితి.. దాదాపు 72వేల మంది ఈ ప్రమాదంలో చిక్కుకుంటే ఇంకా 60వేల మంది సురక్షితంగా బయటపడలేదు. ఇక ఈ వరదల ఉదృతిలో చనిపోయిన వారి సంఖ్య వేలలో ఉంటుందని అంచనా వేస్తున్నారు.
     అదో మహా ప్రళయం. మంచుకొండల్లో సునామీ. గత వందేళ్లలో కనీవినీ ఎరుగని వరద ఉధృతి. ఉత్తరాఖండ్ లో గంగమ్మ మహోగ్రరూపానికి ఊళ్లకు ఊళ్లే మునిగిపోయాయి. వందల సంఖ్యలో వాహనాలు కొట్టుకుపోయాయి. రోడ్లన్నీ దెబ్బతిన్నాయి. పుణ్యక్షేత్రాలు కేదారీనాథ్, బద్రీనాథ్ తోపాటు పలు ప్రాంతాలు జలదిగ్భందంలో చిక్కుకున్నాయి.
    ఇక బాధితులు సంఖ్య 60వేలకు పైగా ఉంటే. మృతుల సంఖ్య మాత్రం వేలల్లో ఉంటుందని అనధికారిక సమాచారం అందుతున్నా వందల్లోనే ఉంటుందని ఉత్తరాఖాండ్ ముఖ్యమంత్రి అన్నారు. అయితే గత రెండు రోజులుగా వాన కాస్త తగ్గుముఖం పట్టడంతో ఉత్తరాఖండ్ సర్కార్ సహాయ చర్యల్ని ముమ్మరం చేసింది. మొత్తం 8వేల 500మంది సైనికులు సహాయ చర్యల్లో మునిగిపోయారు. చెట్టుకొకరు పుట్టకొకరుగా చెదిరిపోయిన వారిని తాళ్లు, చెక్కబల్లలతో వంతెనలు అమర్చి సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.
     30వైమానిక హెలికాప్టర్లు. 12ఆర్మీ హెలికాప్టర్లు రంగంలోకి దిగాయి. కొండల్లో చిక్కకున్న వారిని కాపాడుతున్నారు. కేవలం కేదార్ నాథ్ ప్రాంతంలోనే 40సహాయ శిబిరాలు ఏర్పాటు చేశారు. ముప్పుకు గురైన ప్రాంతాల్లో రెస్క్ మిషన్స్ జల్లెడ పడుతున్నాయి. మరోవైపు సహాయ చర్యల్ని ముమ్మరం చేయాలని సుప్రీం కోర్టు కేంద్ర ప్రభుత్వం, ఉత్తరాఖండ్ సర్కార్ కు ఆదేశాలు జారీ చేసింది. వరదల బీభత్సంపై నివేదిక సమర్పించాలని ఆదేశించింది. 
    ఈ వరదల్లో కేదార్ నాథ్ అత్యంత దారుణంగా దెబ్బ తిందని భావిస్తుంటే ఇప్పుడు బద్రీనాథ్ లో కూడా వరద ఉధృతి తీవ్రంగా ఉంది. బద్రీనాథ్ కు వెళ్లే మార్గంలో కొండ చరియలు విరిగిపడుతుండడంతో ప్రజలు భయంతో వణికిపోతున్నారు. ఈ నెల 22నుంచి మళ్లీ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెబుతుండడంతో ఈ లోగా సహాయ చర్యల్ని పూర్తి చేయాలని సర్కార్  ప్రయత్నిస్తోంది. మరోవైపు యమునా నది కూడా పొంగి పొరలుతోంది. యూపీ, ఢిల్లీలోని కొన్ని ప్రాంతాలు నీట మునిగాయి. యమునా నదీ తీర ప్రాంతాల్లో ఉన్న ప్రజల్ని అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. .
    ఉత్తరాఖండ్  వరదల తాకిడికి కేదార్ నాథ్ విలవిలలాడింది. ఆలయ చుట్టుపక్కల ప్రాంతాలన్నీ మునిగాయి. కానీ ఆలయం మాత్రం చెక్కు చెదరలేదు. ఆలయం లోపల తలదాచుకున్న భక్తులు ప్రాణాలతో బయటపడ్డారు. గంగమ్మ శివాలెత్తినా ఆ శంకరుడే తమని కాపాడాడని భక్తులు చెబుతున్నారు. 
     పరమశివుడు కొలువున్న పుణ్యక్షేత్రం పాండవులు నడయాడిన ప్రాంతం దాదాపుగా వెయ్యేళ్ల క్రితం ఆదిశంకరాచార్యుడు నిర్మించిన ఆలయం ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఇది ఒకటి అక్షయ తృతీయ నుంచి దీపావళి వరకు అంటే ఆరు నెలలపాటు ఈ ఆలయాన్ని భక్తుల సందర్శనార్థం తీసి ఉంచుతారు. ఇక్కడ ప్రకృతి అందాలు వర్ణనాతీతం చుట్టూ మంచుకొండలు దేవదారు వృక్షాలతో కూడిన పచ్చని లోయలు ఆ లోయల్లో పరవళ్లు తొక్కుతున్న గంగమ్మ ‍హొయలు అడుగడుగునా జలపాతాలు ఎన్నెన్నో అందాలు పర్యాటకుల మనసుల్లో మధురానుభూతుల్ని నింపుతాయి. 
     కేదారనాథ్  కొండపై సూర్యోదయం ఓ అద్భుతమైన ఘట్టం. ఆ కమనీయ దృశ్యాన్ని చూడడానికి రెండు కళ్లు చాలవు. తెల్లటి మంచు దుప్పటి కప్పుకున్న కొండల్లోంచి వెలుగులు చిందిస్తూ ఓ దీపం మాదిరిగా సూరీడు పైపైకి వస్తాడు. పాల నురుగులాంటి కొండలు కుంకుమ వర్ణంలోకి మారి మనకు ఓ కొత్త అనుభూతిని కలిగిస్తాయి. కొండపై వాతావరణం కూడా క్షణానికో రకంగా మారిపోతుంది. యాత్రికులతో దోబూచులాడుతుంది. కాసేపు చలి గడగడ వణికిస్తుంది. అంతలోనే నల్లని మబ్బులు కమ్మేసి కుండపోతగా వర్షం కురిసిపోతుంది.
    మరికాసేపటికే మబ్బులన్నీ మటుమాయమైపోయి ఎండ ఫెళ్లున కాస్తుంది. అందుకే కేదార్ నాథ్ ను భక్తులే కాదు. ప్రకృతి ప్రేమికులు కూడా పెద్ద సంఖ్యలో సందర్శిస్తుంటారు. అనుక్షణం ప్రమాదాలు పొంచి ఉన్నా ప్రాణాలకు తెగించి ఈ యాత్ర చేస్తారు. అనునిత్యం శివనామస్మరణతో మారుమోగిన ఈ కొండపైన ఇప్పుడు గంగమ్మ ప్రళయ గర్జనలే వినిపిస్తున్నాయి. మంచుకొండల్లో సునామీ ఆ ప్రాంతాన్ని అతలాకుతలం చేసింది.
    కొండలపైనుంచి ఉగ్ర రూపంలో ఉరుకురికి వచ్చిన గంగమ్మ కేదార్ నాథ్  కొండనే తనలో కలిపేసుకుంటూ ముందుకు సాగింది. ఆలయం చుట్టుపక్కల ఉన్న దుకాణాలు, ఇళ్లు, హోటళ్లు గంగమ్మ ఉప్పెనలో కొట్టుకుపోయాయి. ఇప్పడిక అక్కడ మిగిలింది రాళ్లకుప్పలు.. బురద గుంటలు మాత్రమే.. కేవలం కేదార్  కొండ చుట్టుపక్కలే 6వేల మందికిపైగా గల్లంతయ్యారు. యాత్రికుల్ని శివుని చెంతకు చేర్చే 5వేల గుర్రాల జాడ తెలియడం లేదు.
    మహోగ్రంగా చెలరేగిపోతూ ఊళ్లకు ఊళ్లనే ముంచేసిన గంగమ్మ స్వయంభువుగా వెలిసిన కేదారనాథుడ్ని మాత్రం ఏం చెయ్యలేకపోయింది. ఆ ఈశ్వరుడి మహిమో ఏమో కానీ అక్కడున్నవన్నీ గంగలో కలిసిపోయినా ఆలయానికి మాత్రం ఏం కాలేదు. ఆలయం బయట నిండుగా నిలబడిన నందీశ్వరుడి ప్రతిమ కూడా చెక్కు చెదరలేదు.. అంతే కాదు. వరద తాకిడికి భయపడి ఆలయంలోపలికి వెళ్లి తలదాచుకున్న భక్తులంతా క్షేమంగా బయటపడ్డారు. ఇదంతా చూసిన ఆలయ అధికారులు పరమేశ్వరుడే తన ఆలయాన్ని కాపాడుకున్నారని అంటున్నారు. భక్తిప్రపత్తులతో ఈ సర్వేశ్వరుడికి అంజలి ఘటిస్తున్నారు. 
Courtesy : HMTVLIVE.COM


Support Uttarakhand flood victims

Appeal by Seva Bharati




 

Over a Million affected in the Himalayan Tsunami i.e. the cloudburst and floods in Uttarakhand. Villages together washed away, pain, death and helpless victims everywhere. 38 hours of incessant rains in the hilly garhwal region left local people and pilgrims visiting the holy shrines desperate and helpless.



Kilometres of roads had been washed away. Many bridges, houses, water lines, canals, check dams, electricity lines, power houses and other public and private property had been severely damaged. Kedarnath which is the worst affected has 60 villages washed away in the flood fury is awaiting relief and rescue. An expected 72,000 pilgrims and over a million local people have been affected by the floods.   



Seva Bharati Appeals for support to the flood victims and the pilgrims stranded there without food and water. The organization has deployed its volunteers on the relief and rescue mission and invite you to be part of the effort.



Support the Flood affected :

    Please do mention your name and address so that we can update you along with a receipt of your contribution.



·         Online transfer can be done to Seva Bharati A/C.

·         You can also write a cheque/draft and drop it in any ICICI branch.

·         All contributions to Seva Bharati are tax-exempt under 80G.


                        ICICI Bank number 630501065297
                        IFSC Code ICIC0006305
                        Himayatnagar Branch, Hyderabad



Adm Off:

Seva Bharati,

3-2-106, Nimboliadda,

Kachiguda, Hydrabad-500027

Ph: 040-24610056

 Contact person Sri Murthy ,09618667939

Regd Off

Seva Bharati

3-4-852, Keshava Nilayam, Barkatpura,

Hyderabad, A.P.-500027     

Ph: 040-27565447 ;





 Please do mention your name and address so that we can update you along with a receipt of your contribution.

No comments:

Post a Comment