మన దేశ స్థూల దేశీయోత్పత్తిలో గ్రామీణ వికాసానికి కేటాయిస్తున్నది కేవలం 1.5
శాతం మాత్రమే. అదే చైనాలో 33% కేటాయిస్తున్నారు. పరిస్థితులు ఇలా ఉంటే
మనదేశంలో 60% ప్రజలు ఇంకా గ్రామాల్లోనే నివసిస్తున్నారు. భారత గ్రామాల
మార్కెట్ సామర్ధ్యాన్ని ఇంకా పూర్తి స్థాయిలో సద్వినియోగం
చేసుకోలేకపోతున్నాం. తక్కువ స్థాయి నిరుద్యోగంతో పాటు సరఫరా, డిమాండ్లు
తీవ్రస్థాయి వ్యత్యాసంతో కొట్టుమిట్టాడుతున్నాయి. చిన్న పెట్టుబడులు సైతం
గ్రామాలలో నిరుద్యోగాన్ని రూపుమాపడానికి దోహదం చేసి, గ్రామాల స్వయం
సమృద్ధికి చోదక శక్తులుగా ఉపకరిస్తాయి. యూరప్, చైనాలలో గ్రామాలే పెట్టుబడి
లక్ష్యాలు. అంతేకాదు అవి పట్టణాలు, నగరాలుగా రూపాంతరం చెంది, ఆ దేశాల
అభివృద్ధిలో ఉత్ప్రేరకాలుగా తమవంతు పాత్రను పోషిస్తున్నాయి. కానీ మన దేశంలో
సంప్రదాయ విధానాలతో కూడిన వివక్ష గ్రామీణ భారతాన్ని పేదరికం లోనే ఉంచి,
దారిద్ర్య భారతావనిని ఆవిష్కరిస్తోంది.
http://www.lokahitham.net/2012/01/blog-post_05.html
No comments:
Post a Comment