Monday, March 25, 2013

రామమందిర నిర్మాణానికి పార్లమెంట్ చట్టం చేయాలి


పారదర్శక మండలి తీర్మానం
తీర్మానాన్ని ఆమోదిస్తున్న పారదర్శక మండలి (అశోక్ జీ సింఘాల్ కూడా చిత్రంలో ఉన్నారు)  
 
తీర్థరాజమైన ప్రయాగలో, కుంభమేళాలో ఫిబ్రవరి 6వ తేదీన సాధుసంతుల సమావేశం జరిగింది. అయోధ్య రామ జన్మభూమి స్థలంలో రామమందిర నిర్మాణానికి ఆ సమావేశం తీర్మానం చేసింది. తీర్మాన పాఠం...
త్రేతాయుగంలో ప్రభు శ్రీరామచంద్రుడు జనజాగరణ కోసం గ్రామాలు, అరణ్యాలు తిరిగాడు. అదేవిధంగా ఈ రోజున అయోధ్యలోని రామజన్మభూమి స్థలంలో రామమందిర నిర్మాణానికి జనజాగరణ చేయవలసి ఉందని రామభక్తులకు సాధుసంత్ ల కేంద్రకార్యకారిణి మండలి పిలుపునిచ్చింది. 2013 ఏప్రిల్ 11 నుండి మే 13 వరకు దేశవ్యాప్తంగా అన్ని గ్రామాలు, నగరాలలో జనజాగరణ, రామనామ జపానుష్ఠానం చేయాలని పిలుపునిచ్చింది. ప్రతిరోజు "శ్రీరామ్ జయరామ్, జయజయరామ్' మంత్రాన్ని 108 x 11 సార్లు జపించి ఆధ్యాత్మిక శక్తిని పెంచుకోవాలని, అదే రామమందిర నిర్మాణానికి దారి చూపిస్తుందని వివరించారు. 

1994 సంవత్సరంలో భారతదేశ సర్వోచ్ఛ న్యాయాలయం భారత ప్రభుత్వానికి ఒక సూచననిస్తూ -"1528కి పూర్వం వివాదిత స్థలంలో దేవాలయం కాని, హిందువుల భవనం కాని ఉన్నట్లయితే దానిని పరిగణనలోకి తీసుకొని అందుకు అనుగుణంగా నిర్ణయం చేయాలని" చెప్పిన విషయం, దానికి ప్రభుత్వం అంగీకరించిన విషయాన్ని గుర్తు చేయాలి. గతంలో ఆ స్థలంలో దేవాలయం ఉన్నట్లయితే ఆ స్థలాన్ని హిందువులకు ఇచ్చివేసేందుకు ముస్లిం నేతలు కూడా ఒప్పుకున్నారు. 2010 డిసెంబర్ 30న అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం 1528కి పూర్వం ఆ స్థలంలో హిందూ దేవాలయం ఉన్నట్లు తెలుస్తున్నది. రామలల్లా విగ్రహాలు ఇప్పుడు ఎక్కడైతే ఉన్నాయో అదే రామజన్మభూమి. ఈ రామజన్మభూమిలో గల ఆలయాన్ని 1528లో బాబరు సేనాని కూలగొట్టి అక్కడ మూడు గుమ్మటాలతో ఒక కట్టడం నిర్మించారు.  

అలహాబాద్ హైకోర్టు తీర్పులో ఆ స్థలంలో గతంలో దేవాలయం ఉన్నదని నిర్ధారణయ్యింది. కాబట్టి కేంద్రం, ముస్లిం పెద్దలు ఆ స్థలాన్ని హిందువులకు ఇచ్చి మాట నిలబెట్టుకోవాలి. రాబోయే పార్లమెంట్ సమావేశాల్లో దేవాలయ నిర్మాణం కోసం చట్టం చేసి ఆ స్థలాన్ని రామజన్మభూమి న్యాస్ కు ఇచ్చివేయాలని డిమాండ్ చేస్తున్నాము. ప్రస్తుతం గుడారాలలో ఉన్న రామలల్లా విగ్రహాలను చూస్తున్నప్పుడు హిందువులకు చాలా బాధ కలుగుతున్నది. భవ్యమందిర నిర్మాణానికి హిందువులు ఎంతో ఆతురతతో ఎదురు చూస్తున్నారు. గతంలో భారత ప్రభుత్వం రామజన్మభూమి చుట్టూ ఉన్న 70 ఎకరాల భూమిని సేకరించింది. ఆ స్థలము రామలీలా భూములు. రామజన్మభూమికి సంబంధించిన సాంస్కృతిక భూభాగం అది. ఆ స్థలములో విదేశీ దురాక్రమణదారుడైన బాబరు పేరుతో కాని, ముస్లిం మత చిహ్నం కాని ఏదైనా నిర్మాణం చేయటానికి చేసే ఏ ప్రయత్నాన్నైనా మేము వ్యతిరేకిస్తాం. అయోధ్య హిందువుల సాంస్కృతిక కేంద్రం. దానిని పరిరక్షించాలి. రామజన్మభూమి స్థలంలో రామమందిర నిర్మాణానికి గతంలో ఆరున్నర కోట్ల మంది ప్రజలు నిధులు సమర్పించారు. మందిర ఎలా నిర్మించాలనే వివరాలను రామజన్మభూమి న్యాస్ తయారుచేసి కార్యశాలలో భద్రపరిచారు. అందులో ఉన్న విధంగా రామజన్మభూమి న్యాస్ ద్వారానే అక్కడ మందిరం నిర్మాణం జరుగుతుంది.

హిందువుల మనోభావాలను గౌరవిస్తూ అయోధ్యలోని రామజన్మభూమిలో రామమందిర నిర్మాణానికి అన్ని రాజకీయ పక్షాలు సహకరించి పార్లమెంటులో చట్టం చేయాలని మార్గదర్శక మండలి పిలుపునిచ్చింది. మందిర నిర్మాణానికి పార్లమెంటులో చట్టం చేయకపోతే సాధుసంతుల నేతృత్వంలో హిందూ సమాజం ఆందోళనకు దిగుతుంది. దానికి ప్రభుత్వం పూర్తి బాధ్యత వహించవలసి వస్తుందని హెచ్చరిస్తున్నాము.

No comments:

Post a Comment