Monday, March 25, 2013

హిందువు ఎవరికీ వ్యతిరేకం కాదు


శ్రీ గురూజీ గోళ్వల్కర్

శ్రీ గురూజీ


ఇది హిందురాష్ట్రం. హిందూ భావాలు లేనివారు ప్రపంచంలో కొందరు ఉన్నారు. మన సమాజంలో కూడా ఉన్నారు. వారిలో కొందరు హిందుత్వాన్ని వక్రంగా విమర్శిస్తుంటారు. విమర్శించనీయండి. నష్టం లేదు.

'హిందు'వును గురించి భ్రాంతి కలగచేయడానికి రకరకాల ప్రయత్నాలు సాగుతున్నాయి. అనేక స్వార్థాలకు లోబడి, అనేక రంగాలలో, హిందు అంటే ముస్లిం వ్యతిరేకి అనీ, క్రైస్తవ వ్యతిరేకి అనీ, క్రమేపీ సిక్కులకు, జైనులకు, హరిజనులకు వ్యతిరేకి అని ప్రచారం చేస్తున్నారు. అలా ప్రచారం చేసేవాళ్లకు, వారి వారి రాజకీయాది స్వార్థాలున్నాయి కనుక అంటున్నారు. ధర్మాన్ని, సంస్కృతిని, చరిత్రను చదివి అనడం కాదు. ప్రపంచంలో ఇస్లాం క్రైస్తవ మతాలు పుట్టక ముందు నుండే హిందూ ఆలోచనాపద్ధతి, జీవన విధానం మనదేశంలో ఉన్నాయి. మరి హిందు అంటే ముస్లిం వ్యతిరేకి అవడమేమిటి? అలాగే సిక్కు, జైన మార్గాలు హిందుత్వంలోనివే. హిందుత్వం సిక్కు, జైనులకు వ్యతిరేకమనుకోవడం మన కాళ్లను మన చేతులతో నరుక్కోవడమే. హిందుత్వం వీటికి వ్యతిరేకమెలా అవుతుంది? ఇవన్నీ అల్పబుద్ధుల నుంచి పుట్టిన విమర్శలు. ఈ విమర్శల్లో నిజం లేదు. హిందువు ఎవరికీ వ్యతిరేకం కాదు. ఇది పూర్తిగా భావాత్మకం. వ్యతిరేకాత్మకం కాదు.

No comments:

Post a Comment