Tuesday, February 7, 2012

మత పరమైన హింసకు అధిక సంఖ్యాకులే బాధ్యులు అనే ఊహ అత్యంత ప్రమాదకరమైనది

దేశంలో మత ఘర్షణల నివారణకు ఇప్పటికే ఉన్న చట్టాలను అవసరమైతే పదును పెట్టవచ్చు. కాని 2005 సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం మరో క్రొత్త బిల్ ను ప్రవేశపెట్టింది. దానిపైన ఇస్లాం, క్రైస్తవం నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చింది. 


దానితో ఆ బిల్ ను కేంద్ర ప్రభుత్వం వెనక్కి తీసుకొని ముస్లిం, క్రైస్తవుల అభిప్రాయాలకు అనుగుణంగా ఆ బిల్లు మార్చేందుకు దానిని జాతీయ సలహా మండలికి అప్పచెప్పింది. సోనియా గాంధీ అధ్యక్షతన ఏర్పడిన జాతీయ సలహా మండలి ఈ బిల్లుని మార్చి తయారు చేసింది. ఆ మార్చిన బిల్ పై దేశవ్యాప్తంగా అనేకమంది ప్రముఖులు, ప్రముఖ పత్రికలు తీవ్ర అభ్యంతరము వ్యక్తం చేశాయి. ఆ బిల్లు స్వరూపము యెట్లా ఉందంటే పాలనలో వివక్షతకు మరో రూపంగా ఉంది. మతపరమైన మైనార్టీలు అంటే ఇస్లాం, క్రైస్తవ మతస్తుల రక్షణే తమ మౌలిక కర్తవ్యంగా అందులో చెప్పబడింది. దీనిలో మరో ప్రమాదం పొంచి ఉంది. ఈ బిల్ ఒకవేళ చట్టమయితే ఆ చట్టాన్ని అమలు చేసే అధికారం ఏడుగురు సభ్యులతో కూడిన కమిటీకి అప్పగించబడుతుంది. ఏడుగురిలో నలుగురు మైనార్టీ మతస్తులకు చెందిన వారు ఉండాలనేది నియమం. దీనిని ఏర్పాటు చేసే అధికారం కూడా ఒక కమిటీకి ఉంటుంది. ఈ కమిటీలో  ప్రధానమంత్రి, కేంద్ర హోం మంత్రి, విపక్ష నేతలతో కూడిన ముగ్గురు సభ్యులు ఉంటారు. అంతా తమ చెప్పు చేతలలోనే  ఉంచుకోవాలి, తాము అడమన్నట్లే ఆడాలి అనేది కాంగ్రెస్ లక్ష్యం. ఇది పాలనలో వివక్షతకు దారి తీస్తుంది. ఈ బిల్ ప్రకారం నేరం ఎవరూ చేసినా హిందువులే నేరస్తులు అన్నట్లుగా ఉంది. మత హింస నిరోధానికి ఇప్పుడు ప్రతిపాదించిన బిల్ ఒకవేళ చట్టమయితే ....

1) దేశంలో సామాజిక సామరస్యానికి ఆటంకం ఏర్పడుతుంది.

2) మతం మార్పిడులు విపరీతంగా పెరిగే అవకాశముంది.

3) మతం ముసుగులో ఉగ్రవాదులు పెట్రేగి పోవచ్చు.  


ఈ బిల్ ను దేశంలో అనేకమంది ప్రముఖులు కూడా వ్యతిరేకించారు. వారి మాటలను గమనిద్దాం.


  • జస్టిస్ కే.టి. థామస్, సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి - "ఈ బిల్ చట్టమయితే సుప్రీం కోర్టు పరిశీలనలో నిలబడదు. ఇది బాధ్యతాయుతంగా, నిష్పక్షపాతంగా లేదు. రాజ్యాంగంలోని 21 వ ఆర్టికల్ ప్రకారం నిలబడలేదు".
  • జోగీందర్ సింగ్, మాజీ సి.బి.ఐ. అధిపతి - "ఈ బిల్ మూఢత్వంతో  కూడుకొన్నది, వోట్ బ్యాంక్ రాజకీయాలకు లక్ష్యంగా ఉంది".
  • గురుమూర్తి, స్వదేశీ జాగరణ మంచ్ - "హిందూ సమాజంలో సామరస్య భావముంది. దానిలో ఈ బిల్ జోక్యం చేసుకోనేట్లుగా ఉంది; ఆ సామరస్యానికి విఘాతం కలిగించేట్లుగా ఉంది. ఈ బిల్ - 'విభజించి పాలించు' అని చెప్పేట్లుగా ఉంది"
కాంగ్రెస్ కు బాకాగా పనిచేసే హిందూస్తాన్ టైమ్స్ వంటి పత్రికలు కూడా ఈ బిల్ ను వ్యతిరేకిస్తూ సంపాదకీయాలు వ్రాశాయి. మత పరమైన హింసకు అధిక సంఖ్యాకులే బాధ్యులు అనే ఊహ అత్యంత ప్రమాదకరమైనది. 

ఈ బిల్ కారణంగా మైనారిటీ వర్గాలలోని అసాంఘిక శక్తులు ఎటువంటి జంకు గొంకు లేకుండా మత ఘర్షణలు రెచ్చగొట్టవచ్చు.




http://www.lokahitham.net/2011/11/blog-post_7848.html#more

No comments:

Post a Comment