Tuesday, December 27, 2011

హిందూ హింస బిల్లు


వేదికపై ప్రసంగిస్తున్న శ్రీ ఆరిఫ్ మొహమ్మద్ ఖాన్. కూర్చున్నవారు శ్రీ రామ్ మాధవ్, శ్రీ సి. ఆంజనేయరెడ్డి, శ్రీ టి.హనుమాన్ చౌదరి, శ్రీ ఏం.వి.ఆర్.శాస్త్రి
2011 సంవత్సరం నవంబరు 14వ తేదీన సోషల్ కాజ్ మరియు ప్రజ్ఞాభారతి ఆధ్వర్యంలో హైదరాబాద్ నారాయణగూడ లోని కేశవ స్మారక విద్యా ప్రాంగణంలో జరిగిన మేధావుల సదస్సులో ఆరీఫ్ మొహమ్మద్ ఖాన్ (పూర్వపు కేంద్ర మంత్రి, మేధావి, ముస్లిం అభ్యుదయ వాది), రామ్ మాధవ్ (rss కేంద్ర కార్యకారిణి సభ్యుడు), ఆంజనేయ రెడ్డి IPS రిటైర్డ్, ఏం.వి.ఆర్. శాస్త్రి ఆంధ్ర భూమి సంపాదకుడు, త్రిపురనేని హనుమాన్ చౌదరి అధ్యక్షుడు ప్రజ్ఞాభారత పాల్గొని ప్రసంగించారు. వారి ప్రసంగాల సారాంశం సంక్షిప్తంగా... 
_______________________________________________

ప్రసంగించిన ప్రముఖులు ప్రతిపాదిత బిల్లు గురించి కూలంకషంగా విశ్లేషిస్తూ తమ తమ అభిప్రాయాలు నిర్మొహమాటంగా సభాసదుల ముందు ఉంచారు.

  • సోనియా గాంధీ అధ్యక్షతన ఏర్పడిన నేషనల్ అడ్వైజరీ కమిటీకి ఎటువంటి రాజ్యాంగ నిబద్ధత లేదు. కానీ ! ముస్లింలు, క్రైస్తవులు దానిని గట్టిగా వ్యతిరేకించడం వల్ల ఈ బిల్లుని వెనక్కు తీసుకున్నారు. NAC ని 2010  మార్చిలో పునర్వ్యవస్తీకరించి 14 మందితో తిరిగి ఏర్పాటు చేశారు. నలుగురు సభ్యులు (ఇందులో ఇద్దరు హిందూ వ్యతిరేకులు) ముసాయిదా రూపొందించారు. వీరికి సలహాలు ఇవ్వడానికి ఇంకొక 19  మంది సభ్యులు ఉన్నారు. వీరిలో ఒక్కరు కూడా హిందూ సానుభూతిపరులు లేరు.  
  • నిజానికి ఇటువంటి బిల్లు ప్రవేశపెట్టే అవసరమే లేదు. ఎందుకంటే ఇప్పటికే ఉన్న చట్టాలు అందుకు సరిపోతాయి. కానీ పోలీసు వ్యవస్థకి స్వయం నిర్ణయాధికారం లేదు. 150 సంవత్సరాల నాటి బానిస వ్యవస్థే ఇంకా పోలీసు శాఖలో కొనసాగుతున్నది. అధికారంలో ఉన్న పార్టీకి జై కొట్టడం వినా పోలీసులు ఏమీ చేయలేని దురవస్థ. 
  • యూనిఫాం సివిల్ కోడ్ లేదు. పీనల్ కోడ్ (IPC) అందరికీ ఒకటే అయినా ఈ బిల్లు ఆమోదించబడితే రెండు IPC లుగా మారుతుంది. తిరోగమనమే తప్ప పురోగతి లేదు. 
  • బిల్లు ఆమోదించబడితే ప్రజలు ప్రధానంగా మూడు వర్గాలుగా విభజించబడతారు. బలవంతులు, తక్కువ బలవంతులు, అతి బలహీనులు (బలవంతులు ముస్లింలు క్రైసవులు కాగా హిందువులు అతి బలహీనులౌతారు) 
  • ఇంతా చేసి ఈ బిల్లు హిందువులు అల్పసంఖ్యలో ఉన్న రాష్ట్రాలలో ఆచరణలోకి రాదు. అనగా జమ్మూ కాశ్మీర్, నాగాలాండు, మేఘాలయ, మిజోరం, లక్షద్వీప్ లలో ఇది పని చేయదు.
    ఎటు చూచినా హిందువులకి వెన్నుపోటు మాత్రమే మిగులుతుంది.
  • ఈ బిల్లు చట్టంగా మారితే హిందూ జాతిని నిర్మూలించడం రాజ్యాంగ బద్ధమౌతుంది.
ఎందుకంటే, ఈ చట్టాన్ని అమలు పరిచే సంఘంలో ఏడుగురు సభ్యులు ఉంటారు. అందులో నలుగురు ముస్లిం-క్రైస్తవులు ఉంటారు. వారే అధ్యక్ష, ఉపాధ్యక్ష పదవులలో ఉంటారు. వారిని ప్రశ్నించే అధికారం ఎవ్వరికీ ఉండదు. వారినెవ్వరూ  తొలగించలేరు. 

పూర్వపు కేంద్ర మంత్రి ఆరిఫ్ మొహమ్మద్ ఖాన్ ప్రసంగిస్తూ ఇలా అన్నారు. 
 
"ఈ ప్రతిపాదిత బిల్లు ఓటు బ్యాంకు నిర్మాణం కోసం చేస్తున్న ప్రయత్నమే తప్ప వేరొకటి కాజాలదు. వాస్తవానికి నేను మైనారిటీ మెజారిటీ అన్న సిద్ధాంతాన్నే ఒప్పుకోను. గతంలో షాబానో కేసు విషయంలో సర్వోన్నత న్యాయస్థానం తీర్పును సమర్ధిస్తూ నేను నా మంత్రి పదవినే వదులుకున్నాను. మన రాజ్యాంగం పౌరులందరికీ సమానత్వాన్ని ప్రసాదించింది. ఈ బిల్లుతో ఆ సమానత్వం నశిస్తుంది. నిజానికి నన్ను గాని ఎవరైనా "మైనారిటీ" అంటే నేను దాన్ని ఒక తిట్టుగా భావిస్తాను. వివిధ కులాలూ, మతాల ప్రజలు హాయిగా కలిసి జీవించే సమాజం మనది. ప్రజలను మైనారిటీ మెజారిటీగా విభజిస్తే దుష్పరిణామాలు సంభవిస్తాయి. ఉదాహరణకి తమను మైనారిటీగా పరిగణించాలని కలకత్తా హైకోర్టుకు రామకృష్ణా మఠం గతంలో విజ్ఞాపన చేసింది. ఇది ఎంత విడ్డూరం? ఒక హిందూ సంస్థ తనను మైనారిటీగా గుర్తించమని అర్ధించడం ఎంత దౌర్భాగ్యం? 
 
నేను తులసీ రామాయణం అధ్యయనం చేశాను. అందులో ఎంతో ఉదాత్తమైన అంశాలు ఉన్నాయి. మన సంస్కృతి, సంప్రదాయాల గురించి ఎంతో గొప్పగా చెప్ప బడ్డది. జాతి యావత్తూ ఒక్కటని రామాయణం చెప్పలేదా? మైనారిటీ ఫైనాన్స్ కార్పోరేషన్ లాంటి పదాలు విన్నప్పుడు నాకు కంపరంగా ఉంటుంది. ముందుగా మన దేశానికి కావలసినది ఒక Uniform Civil Code. అంతేగాని మతహింస బిల్లు కాదు. ఈ బిల్లు చట్టంగా మారితే మన దేశానికి కోలుకోలేని దెబ్బ తగులుతుంది. ఈ బిల్లు ప్రవేశ పెట్టే ఆలోచనే సిగ్గుచేటు. మనం చరిత్ర నుండి పాఠం నేర్చుకోవలసి ఉంది" అంటూ ప్రసంగం ముగించారు.  ఎన్.నాగరాజుగారి వందన సమర్పణతో సభ ముగిసింది.
_______________________________________________
"ఊరందరిదీ ఒక దారి - ఉలిపి కట్టదొక దారి" అని సామెత. "వేసినట్లే వేస్తే వేర్రివాడే గెలిచాడు" అనేది ఇంకొక సామెత. మన దేశానికి పట్టిన హీనమైన పరిస్థితి చూస్తుంటే ఇటువంటి సామెతలన్నీ మన కోసమే పుట్టాయా అనిపిస్తూ ఉంటుంది. మన జాతికి ఉన్న కష్టాలూ, క్లేశాలు తక్కువేమీ కావు. క్రొత్తగా ముంచుకొస్తున్న ప్రమాదం ప్రతిపాదిత "మత హింస బిల్లు". ప్రపంచంలో అన్ని దేశాలూ వాటి వాటి రక్షణ చేసుకుంటూ బలోపేతమౌతుంటే మనదేశం మాత్రం స్వీయ విధ్వంసక చర్యలకు పాల్పడుతూ ఉంటుంది. దానికి ఉదాహరణే పార్లమెంటులో చర్చకు పెట్టబోతున్న "Prevention of Communal and Targeted Violence Bill - 2011".  
_______________________________________________  
- ధర్మపాలుడు


 http://www.lokahitham.net/2011/12/blog-post.html

No comments:

Post a Comment