Monday, October 3, 2011

దేశ సంరక్షణ, సమృద్ధి, ప్రజా సంక్షేమం కోసం యువత ముందుండి పని చేయాలి

ఆర్.యస్.యస్. సర్ సంఘచాలక్ శ్రీ మోహన్ భాగవత్ పిలుపు 

ఈ దేశ సమస్యలను పరిష్కరించుకొనేందుకు రాజ్యాంగానికి లోబడి, హింసకు తావు లేని అన్ని రకాల ఉద్యమాలలో యువకులు పాల్గొని, దేశ సంరక్షణ, సమృద్ధి, ప్రజా సంక్షేమానికై కృషి చేయాలని శ్రీ మోహన్ భాగవత్ "మార్టైర్స్ మెమోరియల్ రిసెర్చి ఇన్స్టిట్యూట్ (అమరవీరుల స్మారక పరిశోధనా సంస్థ)" ఆధ్వర్యంలో భాగ్యనగర్లో 24 జూలై ఆదివారం సత్యసాయి నిగామాగమంలో జరిగిన కార్యక్రమంలో యువతకు పిలుపునిచ్చారు. 
-----------------------------------------------------------------------------------  
"మార్టైర్స్ మెమోరియల్ రిసెర్చి ఇన్స్టిట్యూట్ (అమరవీరుల స్మారక పరిశోధనా సంస్థ)" ఆధ్వర్యంలో భాగ్యనగర్లో 24 జూలై ఆదివారం సత్యసాయి నిగామాగమంలో 'భారత్ ముందున్న సవాళ్లు-యువత పాత్ర' అన్న అంశంపై సదస్సు జరిగింది. ఇందులో రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్ సర్ సంఘచాలక్ మా.శ్రీ మోహన్ జీ భాగవత్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.  ఆర్.యస్.యస్. దక్షిణ మధ్యక్షేత్ర సంఘచాలక్ శ్రీ పర్వతరావు రిటైర్డ్ జస్టిస్ ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించారు.  

నేడు యువత ముందు అనేక సవాళ్లు
శ్రీ పర్వతరావు మాట్లాడుతూ - యువత ముందు అంతర్గతంగా, బాహ్యంగా నేడు అనేక సవాళ్లు ఉన్నాయన్నారు. సమాజంపై మార్క్సిస్టులు, తీవ్రవాదులు దాడులు చేయడం, పెచ్చరిల్లిన అవినీతి, భారత ఆహార సంస్థ గోదాముల్లో ధాన్యం కుళ్ళిపోవడం, దాన్ని పేదలకు పంచమని సుప్రీం కోర్టు చెప్పినా, అందుకు కేంద్రం స్పందించక పోవడం, తెలివి గల మన యువతకు దేశంలో ప్రోత్సాహం కొరవడడం, నాటి యువత స్వాతంత్ర్య సమరంలో త్యాగాలు చేస్తే, నేటి యువత సాయుధ దళాలలో చేరేందుకు విముఖత చూపడం, త్వరగా డబ్బు సంపాదించాలన్న ఆలోచనతో ఉండడం, న్యాయవాద వృత్తిని స్వీకరించకపోవడం, న్యాయవాద వృత్తిలో అనేక ఉద్యోగాలు ఖాళీగా ఉండడం - ఇవన్నీ నేటి పరిస్థితిని తెలియచేస్తున్నాయని, దీన్ని ఆపాలని, యువతలో దేశం కోసం, సమాజం కోసం పనిచేసే ప్రేరణ కల్గించాలని అన్నారు. 


ఋగ్వేద సంహిత సి.డి. విడుదల
వేదభారతి అధ్యక్షులు డా.అవధానులు, వారి బృందం కృషి ఫలితంగా వెలువడిన 'ఋగ్వేద సంహిత' సి.డి. లను శ్రీ మోహన్ భాగవత్ విడుదల చేసారు.  


పరిష్కారం కనుగొనాలి
శ్రీ మోహన్ భాగవత్ మాట్లాడుతూ - యువత ధైర్యం, ధృఢవిశ్వాసం, కష్టించి పనిచేసే తత్వం వంటి విలువలు అలవరచుకోవాలని, భారతదేశ భవిష్యత్తు యువత చేతిలో ఉన్నందున వారు నిశ్శబ్దంగా చైతన్యంతో కూడిన ఆలోచనలతో పని చేయాలనీ, స్వాతంత్ర్యం వచ్చి 64  సంవత్సరాలయినా దేశం భిన్నమైన సవాళ్ళను ఎదుర్కొంటూ ఉందని, సమస్యలు వెతకడం కంటే పరిష్కారాలు కనుగొనడం అవసరమని' అన్నారు.  


చైనాతో భారత్ కు గల సరిహద్దుల విషయంలో భారత ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి గురించి ప్రస్తావిస్తూ భారత్ బలమైన జాతిగా ఆవిర్భవించ బోతుందన్న సత్యం చైనా గుర్తించిందన్నారు. మన ప్రాముఖ్యం గుర్తించి చైనా సరిహద్దుల్లో రోడ్లను, రైలు మార్గాలను, విమానాశ్రయాలను  నిర్మిస్తుంటే భారత్ దానికి ధీటుగా స్పందించకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోందన్నారు.  

సాంస్కృతిక దురాక్రమణ
శ్రీ భాగవత్ తమ ప్రసంగంలో విదేశాలు సాంస్కృతిక దురాక్రమణ చేస్తున్నాయని , ఆ విధంగా ప్రజల్ని విభజించాలని చూస్తున్నాయని అన్నారు. అది దేశం శక్తివంతం కాకుండా ఆపే ప్రయత్నమన్నారు. పాశ్చాత్య పద్ధతులైన ఫాదర్స్ డే, మదర్స్ డే లను మన గుడ్డిగా అనుకరిస్తున్నామని, అమ్మను, నాన్నను మన ఆజన్మాంతం గుర్తుంచుకున్తామని, గౌరవిస్తామని, ఇది మన ఘన వారసత్వమని అన్నారు. 

కాశ్మీర్ మనది
ఎవరైనా ఈ దేశం నుండి బయటకు వెళ్లినపుడు కాశ్మీర్ వంటివాటి విషయంలో అది భారత్ లో అంతర్భాగమని, అందులో చర్చకు తావు లేదన్న వైఖరిని కలిగి ఉండాలని, సైన్యాన్ని ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచక, ఎక్కడ తొలగించాలో అక్కడ తొలగించక ప్రభుత్వం తప్పు చేస్తోందన్నారు.


మతహింస బిల్లు - వోట్ బ్యాంకు రాజకీయం
వోట్ బ్యాంకు రాజకీయాల కోసం ప్రభుత్వం దేశ సామరస్యాన్ని దెబ్బ తీసే పనులు చేస్తోందని, ఏ చర్చకూ నోచుకోకుండానే మాటహింస బిల్లును ప్రభుత్వం తమ వెబ్ సైట్ లో ఉంచిందని, జాతీయ సలహా మండలిలోని సభ్యుల నిజాయితీ ప్రశ్నార్ధకమనీ దీన్ని సుప్రీం కోర్టు సైతం ప్రశ్నించందని అన్నారు.

దెబ్బతింటున్న నైతిక విలువలు
ప్రజలకు జవాబుదారిగా ఉండాల్సిన పరిపాలకులు దాని నుండు తప్పించుకోజూస్తున్నారని, దీనివల్ల దోపిడీ కొనసాగుతోందని అన్నారు. దేశ ఆర్థిక పరిస్థితి చుస్తే 20 -25 % మంది ధనవంతులవుతున్నారని, 70 - 75 % పేదలుగా మిగిలి పోతున్నారనీ, పోటీ బాగా ఉందని నిర్లక్ష్యంతో కూడిన, ఆర్ధిక విధానం వాళ్ళ హింస చెలరేగుతుందని, ప్రగతి, నైతికత రెండు కలిసి సాధ్యపడాలని అన్నారు. పాశ్చాత్య భావాలను గుడ్డిగా అనుకరించడం వాళ్ళ మన సామాజిక నైతిక పార్శ్వం దెబ్బ తింటోందని అన్నారు. 

నైతిక విద్య కనపడడం లేదనీ, పాటశాలల, కళాశాలల సంఖ్య పెరుగుతున్న వాటి లాభం సామాన్య ప్రజలకు అందడం లేదన్నారు. జీవితమంటే తిండి, నిద్ర, సుఖం తప్ప ఇంకేవీ లేవనే స్థితిలో విలువలు పడిపోతున్నాయని, విద్య స్వాభిమానాన్ని పెంచేటట్లు ఉండాలన్నారు.  

భారతీయులంతా ఒక్కటే
భారతీయులందరి జన్యువు ఒకటేనని పరిశోధనల్లో తేటతెల్లమైందని, కేవలం కులంతోనో, మతంతోనో, భాషతోనో, ప్రాంతంతోనో తమ ఉనికిని చాటుకునే మనఃస్థితి మార్చుకోవాలని, లేకపోతె అది శత్రువుకు సహకరించినట్లేనని హితవు పలికారు. 


ఘనమైన భారత్
సవాళ్లతో నిరాశ చెందనవసరం లేదని, వాటిని అధిగమించి ముందుకు సాగాలన్నారు. భారతీయులు మేధావులని, ప్రతి అంతర్జాతీయ పోటీలో వారు ముందున్నారని అన్నారు. విద్యాధికులైన యువత సామాజిక కార్యక్రమాలు చేస్తూ ఇతరులకు ప్రేరణగా నిలుస్తున్నరన్నారు. భారత దేశం విజ్ఞానఘని అని, ప్రక్రుతి వనరులు పుష్కలమని, ప్రతిభ, నైపుణ్యం అపారమన్నారు. అత్యంత దయనీయమైన ఆర్ధిక సంక్షోభం వింటి విపత్కర పరిస్థితిలో కూడా మనకు లోటు రాదన్నారు.
సంక్షోభంలో కూడా మనం నిలబదగాలిగమని, ఇది ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచిందని అన్నారు. యువత తమ ఉనికి, విశ్వసనీయత, శీలం పై వస్తున్న విమర్శలకు సమాధానమిస్తూ నిలబడాలన్నారు. మన చరిత్ర, నిజమైన వారసత్వం గూర్చిన అవగాహనా నేడు కొరవడిందన్నారు. యువత స్వాభిమానాన్ని, ఆత్మగౌరవాన్ని పెంపొందించుకోవాలని పిలుపునిచ్చారు.  

యువత ముందుకొచ్చి పని చేయాలి
వసుధైక కుటుంబకం అనే భావన భారతదేశ విశిష్ట లక్షణమని, కనుక మిగిలిన ప్రపంచంలో మనకెవరూ శత్రువులు లేరన్నారు. అయితే ప్రపంచంలో చెడ్డ వ్యక్తులు లేకుండా పోరు కాబట్టి మనం వారి దుశ్చర్యల నుంచి మనల్ని మనం ప్రజాస్వామ్య బద్ధంగా, అహింసాయుతంగా రక్షించుకోవాలన్నారు. భారతీయ మూలాలను తెలుసుకుని, భారతీయతను ఎల్లప్పుడు మనసులో ఉంచుకోవాలన్నారు. తలుపులు తెరుచుకుని యువత బయటకు రావాలని, దేశానికి సేవ చేయాలనీ అన్నారు.  


విప్లవం కంటే వికాసం ముఖ్యమని, అందరు  నిస్వార్ధంగా సేవ చేయడానికి  ముందుకు రావాలనీ, చైనా వెళ్లి మన ప్రాచీన ధర్మాన్ని ప్రభోదించిన బౌద్ధ సన్యాసుల గురించిన ఉదాహరణలు మన ముందున్నాయని అన్నారు. 

దేవీ దేవతల పూజల కన్నా జాతి నిర్మాణంపై దృష్టి సారించాలని వివేకానందుడు చేసిన ఉద్బోధ గుర్తు చేసారు. దేశ సంరక్షణ కోసం, సమృద్ధి కోసం, ప్రజా సంక్షేమం కోసం, యువత ముందుండి పని చేయాలనీ, మన దేశ ఆదర్శ పరంపరను కొనసాగించాలని పిలుపునిస్తూ ముగించారు.    

No comments:

Post a Comment