Sunday, October 16, 2011

త్వరలో వెలువడనున్న శ్రీ బాలాసాహెబ్ జీ జీవిత చరిత్ర

రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ తృతీయ సర్ సంఘచాలక్ గా  సంఘాన్ని అత్యంత ఉన్నత స్థాయిలో నడిపించిన వ్యక్తిగా చరిత్ర పుటల కెక్కిన శ్రీ బాలాసాహెబ్ జీ జీవిత చరిత్ర తెలుగు పాఠకులకు త్వరలో అందుబాటు లోకి రానున్నది.  
శ్రీ బాలాసాహెబ్ జీ

మహారాష్ట్రకు చెందిన ప్రాధ్యాపకులు శ్రీ శరత్ హెబ్బాల్కర్ మరాఠీలో వ్రాసిన శ్రీ బాలాసాహెబ్ జీ జీవిత గాథను శ్రీ రంభావూ హల్దేకర్ జీ తెలుగులోకి అనువదించే పని ప్రారంభించారు. 2012 ఫిబ్రవరి 12 వ తేదీన విడుదల కానున్న ఈ పుస్తకం దాదాపు 350 పుటలతో, బాలాసాహెబ్ జీ జీవితాన్ని ప్రతిబింబించే అనేక ఛాయాచిత్రాలతో స్వయంసేవకులందరూ పవిత్రంగా భద్రపరచుకొనే రీతిలో వెలువరించే ప్రయత్నం జరుగుతున్నది.  
 
ఈ పుస్తకం కొనదలచిన వారు ప్రచురణకు పూర్వపు వెలగా రూ.100/- చెల్లించి భాగ్యనగర్లోని సాహిత్యనికేతన్లో మీ పేరు నమోదు చేయించుకోవచ్చును. పుస్తకం ముద్రించబడిన వెంటనే మీకు అందించబడుతుంది.

No comments:

Post a Comment