తెలుగు మన మాతృభాష. అంటే తల్లినుడి. అంటే తల్లి పలుకు. వేల ఏండ్లుగా కోట్లమంది భాషగా, ఇతర భాషలతో కలసి మెలసి ఎంతో పద సంపదను సొంతం చేసుకొంది. గడిచిన రెండు దశాబ్దాలుగా ప్రపంచీకరణ నేపథ్యంలో మన మాతృభాషకు ఎన్నో సవాళ్ళు ఎదురవుతున్నాయి.
నేడు దేశవ్యాప్తంగా మాతృభాషా పరిరక్షణకు ఉద్యమించవలసిన పరిస్థితులు ఎదురవు తున్నాయి. దేశవ్యాప్తంగా, వివిధ దేశాలలో 18 కోట్లకు పైగా ఉన్న మన తెలుగు వారు తెలుగు భాష సంరక్షణకు ఉద్యమించవలసి వచ్చింది. ఉద్యోగ అవసరాలకు, ఉన్నతంగా ఎదిగేందుకు తెలుగు భాష పనికి రాదు అనే వ్యామోహంలో చిక్కుకొన్నాము. ఈ పరిస్థితులను మార్చేందుకు మనమందరం ముందుకు రావాలి. అక్టోబర్ 28 నుండి నవంబర్ 5 వరకు తెలుగు భాష పరిరక్షణకు జరుగుచున్న జనజాగరణ కార్యక్రమంలో పాలు పంచుకోండి.
No comments:
Post a Comment