Tuesday, October 11, 2011

భారత దేశ విభజన సమసి పోవాలి

Source : http://www.lokahitham.net/2011/08/blog-post_7478.html#more

Akhanda Bharat

వెయ్యి, పన్నెండు వందల సంవత్సరాల భారత దేశ చరిత్రలో ఒక మచ్చ దేశ విభజన. 1947 ఆగష్ట్ 14 వ తేదీనాడు భారత దేశం ముక్కలు చేయబడి ప్రపంచ పటంలో ఒక క్రొత్త దేశం ఏర్పడింది. బహుశ ప్రపంచంలో మతం ఆధారంగా ఏర్పడిన దేశం అదే కావచ్చు. అదే పాకిస్తాన్. ఆ దేశం ఏర్పడటమే విద్వేష భావంతో ఏర్పడింది. ఒక రాజ్య విభజన 5 వేల సంవత్సరాల పూర్వం మహాభారత సంగ్రామానికి దారి తీసింది. ఆ విభజన నుండి ఈ దేశం ఏమి పాఠం నేర్చుకోలేదు. 1947 14 వ తేదీనాడు జరిగిన దేశ విభజన నుండి కూడా ఈ దేశ పాలకులు ఎటువంటి పాఠం నేర్చుకోలేదు.

విభజనతో ఏమి సాధించాము? అంటే 1) ఈ దేశం యొక్క సార్వభౌమత్వాన్ని కాపాడుకోలేక పోయాము. 2 ) వేలాది సంవత్సరాల ఈ దేశ సంస్కృతిక జాతీయ భావాలకు అవమానం కలుగచేయటమే కాక దానిని ప్రశ్నార్ధకంగా మార్చుకున్నాము. మతాన్ని జాతీయతతో ముడి పెట్టి భిన్న జాతుల సిద్ధాంతాలకు బలం చేకూర్చాము. దేశ విభజనకు కారణమైన బ్రిటిష్ వాళ్ళ 'విభజించి పాలించు' నీటినే ఈనాటి మన పాలకులు స్వీకరించి దేశ ప్రజలను చీలుస్తూనే ఉన్నారు. స్వాతంత్ర్యం వచ్చిన 64 సంవత్సరాల తరువాత ఈ ద్వంద్వ నీతికి పరాకాష్ట సచార్ కమిటి నివేదిక. మరియు ఈ మధ్యనే సోనియా గాంధీ నాయకత్వంలో ''జాతీయ సలహా మండలి'' తయారుచేసిన మాట ఘర్షణల నివారణ బిల్లుల రూపంలో మనకు కనబడుతున్నది. ఈ రెండు ముస్లిం వోట్ బ్యాంకు ను తిరిగి తమవైపు త్రిప్పుకొనేందుకే కాంగ్రెస్ చేస్తున్న పని అని తేటతెల్లమవుతున్నది. 

భారత దేశ విభజన చేసిన బ్రిటిష్ ప్రభుత్వం పాకిస్తాన్ ను ఒకరకంగా అమెరికాకు అప్పగించినట్లయింది. అమెరిక అండదండలతో పాకిస్తాన్ మతపరమైన ఉగ్ర వాదానికి ప్రాణం పోసింది. అది ఈ రోజున వేళ్ళూనుకుని ప్రమాదకర స్థాయికి చేరుకొంది. పాకిస్తాన్ ఇప్పటికే ఒక విఫలమైన దేశం. తన అస్తిత్వాన్ని కాపాడుకొనేందుకు భారతవ్యతిరేకతను ప్రధాన ఆయుధంగా ఎంచుకొంది. ఇది ఇంకా ఎక్కువ కాలం కొనసాగే అవకాశం కనబడటం లేదు. పాకిస్తాన్ తో మనకు ఉన్న సమస్యలను పరిష్కరించుకో లేకపోవడానికి కారణం మన దౌత్య పరమైన వైఫల్యాలే. భారత్ శక్తివంతమై దేశ విభజన సమసి పోయినట్లయితే నేటి అనేక సమస్యలకు పరిష్కారం లభిస్తుంది.

దేశ విభజన గురించి శ్రీ అరవిందుని మాటల్లో...
-"భారతదేశం స్వతంత్రమైనది. కానీ సమగ్రతను పోగొట్టుకుంది. బీటువారిన, వికలమైన స్వాతంత్ర్యం మాత్రమే సిద్ధించింది.  "హిందువులు, ముస్లింలు" అంటూ రగిలిన పాతకాలపు మాట విభేదాలు కరుడుకట్టి దేశాన్ని విభజింప చేసి, శాశ్వత రూపాన్ని సంతరించుకున్నాయి. ఈ పరిణామం శాశ్వతం కాదని, ఇదొక తాత్కాలిక పరిష్కారం మాత్రమే అని కాంగ్రేసూ, జాతీ గ్రహిస్తాయని ఆశించాలి. ఇదే శాశ్వతమైతే భారతదేశం బలహీనమవుతుంది. అంతఃకలహాలు సంభవించవచ్చు. ఏదో కొత్త దాడి, విదేశీ దురాక్రమణ కూడా సంభవించవచ్చు. ఈ ఉద్రిక్తత క్రమంగా తగ్గటం వల్లా, శాంతి-సుహ్రుద్భావము అవసరమన్న అవగాహన పెరగటం వల్లా, అవసరమైతే ఒక ఒడంబడిక ద్వారానైనా సరే, కలిసి పనిచేయవలసిన నిత్యావసరం రావడం వల్లా దేశ విభజన అంతమవాలి. ఆ రూపానికి ఆచరణ యోగ్యతే ఉంటుంది. ఏమయినా ఎట్లాగైనా దేశ విభజన పోతుంది, పోవాలి. విభజన సమసిపోకపోతే భారతదేశ భవిష్యత్తు బాగా దెబ్బ తింటుంది. విఫలం కుడా కావచ్చు. అది జరగకూడదు.

No comments:

Post a Comment