Source : http://www.lokahitham.net/2011/08/blog-post_6172.html
ఒక శిష్యుడు : భారత దేశానికి ఆదర్శప్రాయమైన ప్రభుత్వమెట్లా ఉండాలి?
యోగి అరవింద |
1938 డిసంబరు 27 నాటి యోగి అరవిందుని సందేశం
ప్రాచీన భారతంలోని ప్రభుత్వ వ్యవస్థ ప్రజల జీవితావసరాల ననుసరించి వికసించింది. అందులో అందరికీ, అన్ని అవసరాలకీ స్థానముండేది. ప్రభుత్వంలో రాజులకు, ప్రభువులకు, ప్రజలకు ప్రాతినిధ్యముండేది. యూరప్ లోనూ, పాశ్చాత్య దేశాలలోనూ వ్యవస్థ కేవలం మేధా జనితం, అంతా హేతువాద బద్ధం. అన్నీ ఒక క్రమబద్ధంగా ఉండాలని చూసారే గాని అందులో స్వేచ్చకి, వైవిధ్యానికీ తావు కల్పించలేదు. ప్రజా స్వామ్యమంటే - ప్రజాస్వామ్యానికే గానీ ఇంకా దేనికీ స్థానం లేదు. సమయానుకూల మార్పులకు తావు లేదు. భారత దేశమిప్పుడు పాశ్చాత్యులని అనుకరింపబోతోంది. పార్లమెంటరీ వ్యవస్థ భారత దేశానికి నప్పదు. కానీ, పాశ్చాత్యులు విడనాడిన వాటినే మనమెప్పుడు తీసుకుంటుంటాం.
ఒక శిష్యుడు : భారత దేశానికి ఆదర్శప్రాయమైన ప్రభుత్వమెట్లా ఉండాలి?
టాగూర్ వ్రాసినట్లు ఉండాలి. అన్నిటికంటే ప్రధానంగా ఒక రాష్ట్రపతి ఉండాలి. ఆయనకి విస్తృతమైన అధికారముండాలి. విధానాలు నిరాటంకంగా కొనసాగటానికి, దేశానికి ప్రాతినిధ్యం వహించటానికి ఒక శాసన సభ ఉండాలి. రాష్ట్రాలన్నీ ఒక ఫెడరేషన్ గా ఏర్పడి కేంద్రం వద్ద సంయుక్తంగా ఉండాలి. స్థానిక సంస్థలకు తమ సమస్యలని తమకి తోచిన రీతిన పరిష్కరించుకోవటానికి అవకాశమివ్వాలి.
No comments:
Post a Comment