Sunday, October 16, 2011

మీ 'ఓదార్పు' ఆపండి మహాప్రభో...

ఇటీవల సిక్కిం ప్రాంతాన్ని తీవ్ర భూకంపం అతలాకుతలం చేసింది. వివిధ కారణాలుగా అక్కడ సహాయక చర్యలు చేపట్టడంలో ఆలస్యం జరిగింది. అయినా ఆర్.ఎస్.ఎస్. స్వయంసేవకులు ఎలాంటి కష్టాలనూ లెక్క చేయకుండా వెంటనే సహాయక చర్యలు చేపట్టారు. 
 
ఇదిలా ఉండగా ఎప్పటిలాగే సైన్యానికి సహాయ బాధ్యతలు అప్పగించబడ్డాయి. కొండలు, కోనలు, లోయలతో నిండిన సిక్కింలో పని చేయడానికి సైన్యానికి కష్టంగా ఉన్నది. ఐతే చెసేదేదీ లేకపోయినా రాహుల్ గాంధీ వచ్చి వెళ్ళాడు. చిదంబరం పర్యటించాడు. ఒక ప్రక్క ప్రజలు నానా బాధలలో ఉంటే సైనిక హెలికాప్టర్లు యువరాజు మరియు చిదంబరం సేవలో మునిగి ఉండడం వల్ల సహాయక చర్యలకు విఘాతం కలిగింది. ఇంకా అయ్యవార్లు చాలామందే రావాలని ఉబలాట పడుతూ ఉండడం గమనించి, సైనికాధికారులు "అయ్యా ! మీ ఓదార్పులు ఆపండి - మా పని మమ్మల్ని చేసుకోనివ్వండి" అని బ్రతిమాలుకున్నారు. "ఈ వి.ఐ.పి. ల బాధ మేం పడలేక పోతున్నాం. వీరి కారణంగా సహాయం పనులు చెడిపోతున్నాయి" అని ఒక ఉన్నతాధికారి వాపోయారు పాపం.

No comments:

Post a Comment