Thursday, October 13, 2011

సామాజిక ఐక్యతను సాధించే ఏకైక ఆశాకిరణం ఆర్.ఎస్.ఎస్.

సంఘం ప్రారంభించి ఈ విజయ దశమికి 86 పూర్తయి 87 వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్నది. ఆ  సందర్భంగా ప్రత్యేక వ్యాసం.


ప్రపంచంలో భారతదేశానికి ఒక విశిష్టత ఉన్నది. ప్రపంచ కళ్యాణానికి కావలసిన విజ్ఞానం భారతదేశం నుండి అందుతుంది. 2000 సంవత్సరం ఆగస్టులో జరిగిన మత మహా సమ్మేళనం ముగింపు కార్యక్రమంలో కోఫీ అన్నన్ మాట్లాడుతూ -"హిందుత్వం విశ్వ జనీనమైనది. ఈ చరాచర సృష్టికి అన్వయించదగినది. హిందువులు హిందుత్వ విలువలతో శక్తివంతమై ప్రపంచ శాంతిని సాధించాలి. ప్రపంచంలో హిందువులు కాని ఐదు బిలియన్ల ప్రజలకు ఒక బిలియన్ హిందువులు మతాలకు అతీతంగా మానవతా విలువలలో శిక్షణ ఇవ్వాలని" పిలుపునిచ్చారు.  

కోఫీ అన్నన్ కోరినట్లు హిందుత్వ విలువల ఆధారంగా హిందూ సంఘటనకు, తద్వారా విశ్వ కళ్యాణానికి కృషి చేస్తున్న ఏకైక ఆశాకిరణం ఆర్.ఎస్.ఎస్.  ఇది అతిశయోక్తి కాదు. దేశ రాజకీయ వ్యవస్థపై ప్రజలు ఎంత ఆగ్రహంగా ఉన్నారంటే గడచిన కొద్ది రోజుల క్రితం ప్రారంభమైన అవినీతి వ్యతిరేక ఉద్యమానికి దేశమంతా యెట్లా కదిలిందో చూశాము. ఈ ఉద్యమాన్ని దీర్ఘకాలం కొనసాగించాలి. ఈ పరిస్థితులలో దేశ ప్రజలందరికీ ఆశాకిరణంగా రాష్ట్రీయ స్వయంసేవక సంఘం కనబడుతున్నది. సంఘం ప్రారంభించి 75 సంవత్సరాలు పూర్తైన సందర్భంగా 3 లక్షలకు పైగా గ్రామాలలో నిర్వహించిన సర్వేక్షణ ఆధారంగా ఇంకా అనేక కార్యక్రమాలు రూపొందించబడ్డాయి.  

2006 - 07  సంవత్సరం పరమ పూజనీయ శ్రీ గురూజీ శత జయంతి ఉత్సవాల సందర్భంగా మంగుళూరు విరాట్ హిందూ సమ్మేళనంలో 80 వేల మందికి పైగా హిందువులు పాల్గొన్నారు. ఆ కార్యక్రమంలో శ్రీ మోహన్ జీ  మరియు స్వామీజీల ఉపన్యాసాలు విన్న స్థానిక ముస్లింలు "మేము జిహాదీ ముస్లింలం కాదు, ఈ దేశ ముస్లింలమే" అని ప్రకటించి 80  వేల మందికి ఆత్మీయతతో నిమ్మరసం త్రాగించారు. 100 మందికి పైగా క్రైస్తవ ప్రముఖులు కూడా "మేము రోమన్ క్యాతలిక్కులము కాదు, భారతీయ క్రైస్తవులము" అని ప్రకటించారు. ఇదంతా హిందూ సమాజం శక్తివంతం కావటం వలన జరిగింది. దేశమంతట సంఘము ఈ పని నిర్వహించేందుకు కార్యకర్తలను సిద్ధం చేయటం, ప్రజల వద్దకు తీసుకొని వెళ్ళటం చేస్తున్నది. ఈ పనులు కేవలం సంఘము - దాని ప్రేరణతో పనిచేసే సంస్థలే కాక ఇంకా అనేక మంది అనేక రకాల సఫల ప్రయోగాలు చేస్తున్న వారున్నారు. వారిని కూడా కలుపుకుని ముందుకు పోవాలనే సంకల్పంతో ఆ దిశలో సంఘం వేగంగా అడుగులు వేస్తున్నది. 

Source : http://www.lokahitham.net/2011/10/blog-post_4642.html

No comments:

Post a Comment